దుబాయ్ లో 30% ఆల్కహాల్ అమ్మకపు పన్ను పునరుద్ధరణ..!!
- December 07, 2024దుబాయ్: దుబాయ్ లో జనవరి 1, 2025 నుండి ఆల్కహాల్‌పై 30 శాతం పన్నును పునరుద్ధరించింది. ఈ మేరకు మార్పుల గురించి ఆల్కహాల్ రిటైలర్ ఆఫ్రికన్ + ఈస్టర్న్ రెస్టారెంట్‌లు, బార్‌లకు ఇమెయిల్‌లో తెలియజేశారు.మద్య పానీయాల కొనుగోళ్లపై 30 శాతం మునిసిపాలిటీ పన్నును జనవరి 2025 నుండి పునరుద్ధరించబడుతుందని దుబాయ్ ప్రభుత్వం తమకు తెలియజేసిందని మెజెస్టిక్ రిట్రీట్ సిటీ హోటల్ మరియు పర్మిట్ రూమ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎటి భాసిన్ వెల్లడించారు.జనవరి 1, 2025 నుండి అన్ని ఆర్డర్‌లపై ఈ మేరకు ప్రభావం చూపుతుందన్నారు.జనవరి 2023లో దుబాయ్ మునిసిపాలిటీ ఎమిరేట్‌లో ఆల్కహాల్ అమ్మకాల పై 30 శాతం పన్నును ఒక సంవత్సరం పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అనంతరం దానిని డిసెంబర్ 2024 చివరి వరకు పొడిగించారు.
తాజా వార్తలు
- ప్రముఖ గాయకుడు వై.ఎస్.రామకృష్ణకు ఎన్టీఆర్ వంశీ గ్లోబల్ అవార్డు
- నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన వైసీపీ
- మహా కుంభమేళాలో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం
- మైదుకూరులో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- సింగపూర్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్
- గన్నవరం ఎయిర్ పోర్ట్ కు అమిత్ షా
- డేటా సెంటర్లకు రాజధానిగా హైదరాబాద్..
- దుబాయ్ హిందూ మందిరానికి అరుదైన గౌరవం
- ప్రపంచ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో యూఏఈ కీలకం..!!
- సౌదీలో 2.9 మిలియన్లకు పైగా క్యాప్‌గాన్ పిల్స్ సీజ్..!!