చెత్త ఎయిర్ లైన్స్ జాబితాలో 103వ స్థానం పొందిన ఇండిగో ఎయిర్లైన్

- December 07, 2024 , by Maagulf
చెత్త ఎయిర్ లైన్స్ జాబితాలో 103వ స్థానం పొందిన ఇండిగో ఎయిర్లైన్

ముంబై: ఇండిగో ఎయిర్లైన్స్ 2006లో భారతదేశంలో తన సేవలను ప్రారంభించింది. ప్రారంభంలోనే తక్కువ ధరలతో ప్రయాణికులకు సేవలు అందించడం ద్వారా, ఇండిగో ఎయిర్లైన్స్ త్వరగా ప్రజాదరణ పొందింది. ప్రస్తుతం 75కి పైగా దేశీయ గమ్యస్థానాలకు, 24 అంతర్జాతీయ గమ్యస్థానాలకు సేవలు అందిస్తోన్న భారత దేశపు ఎయిర్ లైన్ సంస్థ ప్రపంచంలో పరమ చెత్త ఎయిర్ లైన్స్ జాబితాలో 103వ స్థానంలో నిలిచింది. 

ఇందుకు ప్రధాన కారణం గత ఏడాదిలో ప్రయాణికులకు అందించే సేవలు, సమయపాలన, ఫీడ్‌బ్యాక్, లగేజీ చేర్చడం వంటి కారణాలు ఇందుకు కారణం. ఇండిగో ఎయిర్లైన్స్ ఎల్లపుడూ తమ లాభాలను ఎక్కువగా చూసుకుంటున్నారని, ప్రయాణికులకు సేవలు అందించడంలో అలసట చూపిస్తున్నారని అందులో ప్రయాణించే ప్రయాణికులు ఎల్లప్పుడూ ఫిర్యాధు చేస్తుంటారు. 

ప్రైవేట్ ఎయిర్లైన్స్ శకం ప్రారంభం అయినతరువాత ఇండిగో పేరెంట్ సంస్థ కేవలం డెక్కన్ ఎయిర్లైన్స్, కింగ్ ఫిషర్,ఎయిర్లైన్స్ కు టికెటింగ్ సాఫ్ట్వేర్ చూసేవారు. ,డెక్కన్ ఎయిర్లైన్స్ ,కింగ్ ఫిషర్ ఎయిర్లైన్ నష్టాల బాటలో నడుస్తున్న సమయంలో ఇండిగో ఎయిర్లైన్ తన ప్రయాణం మొదలు పెట్టీ అనతి కాలం లోనే ఇండియా నంబర్ వన్ ఎయిర్లైన్ గా రూపొందింది కానీ ప్రయాణికుల సేవలో, సమయం పాటించడంలో,ప్రయాణీకుల ఫీడ్ బాక్ విషయంలో పరమ చెత్త అభిప్రాయాన్ని మూటగట్టుకుంది.


ఇకపోతే 2006 నవంబర్ 7న ప్రారంభమై.. 2007 మార్చి 25న తన కార్యకలాపాలను ప్రారంభించిన బెల్జియం దేశానికి చెందిన బ్రస్సెల్స్ ఎయిర్లైన్స్ ఈ ఏడాది ప్రయాణికుల మెప్పు పొంది, వరల్డ్ బెస్ట్ ఎయిర్లైన్స్ కిరీటాన్ని అందుకుంది. ఇది నిజంగా అభినందనీయమైన విషయం బ్రస్సెల్స్ ఎయిర్లైన్స్ ప్రారంభం నుండి ప్రయాణికుల సంతృప్తిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. 

బ్రస్సెల్స్ ఎయిర్లైన్స్ వరల్డ్ బెస్ట్ ఎయిర్లైన్స్ కిరీటాన్ని అందుకోవడానికి ప్రధాన కారణాలు అనేకం ఉన్నాయి. మొదటగా, ఈ ఎయిర్లైన్ ప్రయాణికులకు అత్యుత్తమ సేవలను అందిస్తుంది. సౌకర్యవంతమైన సీట్లు, రుచికరమైన భోజనం, వినోదం కోసం ఆధునిక సదుపాయాలు, ఉచిత వైఫై వంటి అనేక సౌకర్యాలను అందిస్తుంది. 
ఇంకా, బ్రస్సెల్స్ ఎయిర్లైన్స్ సమయపాలనలో కూడా మంచి పేరు సంపాదించింది. 

విమానాలు సమయానికి బయలుదేరడం మరియు చేరుకోవడం ద్వారా ప్రయాణికులకు సమయాన్ని ఆదా చేస్తుంది. ప్రయాణికుల ఫీడ్‌బ్యాక్‌ను సీరియస్‌గా తీసుకుని, తమ సేవలను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తోంది.
ఇలా ఈ ఎయిర్లైన్ ప్రయాణికులకు అనేక సదుపాయాలను అందిస్తుంది. 


ఇప్పటికైనా ఇండిగో ఎయిర్లైన్స్ ప్రయాణికుల ఫీడ్‌బ్యాక్‌ను సీరియస్‌గా తీసుకుని, తమ సేవలను మెరుగుపరచడానికి ప్రయత్నించాలని కోరుకుందాం. ప్రయాణికుల సంతృప్తి కోసం, ఎయిర్లైన్ తన సేవలను నిరంతరం మెరుగుపరచుకోవాలని, ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచి, సమయపాలనలో కూడా మంచి పేరు సంపాదించాలని భారతీయులుగా ఆశిద్దాం.

--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com