ఉద్యోగుల తొలగింపు పై స్పందించిన ఒమన్ ఎయిర్..!!
- December 08, 2024
మస్కట్: ఉద్యోగులను తొలగించినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పుకార్లను ఒమన్ ఎయిర్ తోసిపుచ్చింది.1,000 మంది ఉద్యోగుల తొలగింపుకు సంబంధించి వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రసారం అవుతున్న వార్తలను ఖండించింది. పునర్నిర్మాణం కారణంగా ఒమన్ ఉద్యోగులెవరిని తొలగించలేదని తెలిపింది. కంపెనీని ఆర్థిక స్థిరత్వం వైపు మళ్లించడానికి ఒమన్ ఎయిర్ సమగ్ర కార్యాచరణ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొంది. అయితే, 365 మంది ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారని, ఒమానీ ఉద్యోగులకు ప్రత్యామ్నాయ పరిష్కారాలను చూపడానికి యాజమాన్యం సంబంధిత అధికారులతో కలిసి పని చేస్తోందని తెలిపారు. వారి సేవలకు మెరుగైన ప్యాకేజీ అందించినట్టు పేర్కొన్నారు.అదే సమయంలో 426 మంది ప్రవాస ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించినట్టు తెలిపారు. తమ సంస్థలో ఒమనైజేషన్ రేటు 74% నుండి 78%కి పెరిగిందన్నారు. చాలా విభాగాలలో 90% పైగా ఒమనైజేషన్ రేటు ఉందన్నారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయా ఫండ్‌రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం
- టూరిస్టుల కోసం విశాఖ తీరంలో మెగా సెలబ్రేషన్స్
- సైబర్ మోసగాళ్ల కొత్త వ్యూహాలు..జాగ్రత్త తప్పనిసరి!
- మచిలీపట్నం–అజ్మీర్ మధ్య ప్రత్యేక రైలు: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!







