రియాద్ సీజన్.. 2 నెలల్లో 10 మిలియన్ల మంది సందర్శకులు..!!
- December 08, 2024
రియాద్: రియాద్ సీజన్ 2024కి రికార్డు స్థాయిలో సందర్శకులు వచ్చారు. ప్రారంభమైన రెండు నెలల్లోనే 10 మిలియన్ల మంది సందర్శించారని జనరల్ ఎంటర్‌టైన్‌మెంట్ అథారిటీ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ టర్కీ అల్-షేక్ ప్రకటించారు. ప్రపంచంలో అతిపెద్ద ఎంటర్ టైన్ మెంట్ సీజన్లలో ఒకటైన రియాద్ సీజన్ అక్టోబర్ 12న ప్రారంభమైంది. లైవ్ కాన్సర్ట్ లు, ఆర్ట్ ఎగ్జిబిషన్‌లు, థియేట్రికల్ ప్రదర్శనలు, వినోద కార్యక్రమాలతో సహా వేలాది విభిన్న కార్యక్రమాలతో సందర్శకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
రియాద్ సీజన్ ఈవెంట్‌లలో 14 ఎంటర్‌టైన్‌మెంట్ జోన్‌లు, 11 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు, 10 ఫెస్టివల్స్, ఎగ్జిబిషన్‌లతో పాటు 7.2 మిలియన్ చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. బాక్సింగ్ మ్యాచ్‌లు, రెజ్లింగ్, టెన్నిస్, కాన్సర్టులు, రెస్టారెంట్‌లు, గార్డెన్‌లు, కొత్త వినోద అనుభవాలతో రియాద్ సీజన్ ప్రముఖ వినోద గమ్యస్థానంగా మారింది. సీజన్‌లో ఐదు ప్రధాన జోన్‌లు బౌలేవార్డ్ వరల్డ్, కింగ్‌డమ్ అరేనా, బౌలేవార్డ్ సిటీ, ది వెన్యూ, అల్ సువైదీ పార్క్ సందర్శకులకు కొత్త అనుభవాన్ని అందిస్తున్నాయని టర్కీ అల్-షేక్ వెల్లడించారు.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్‌కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!
- రీసైకిల్ పదార్థాలతో క్రెడిట్ కార్డుల తయారీ..!!
- అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే
- తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం







