కారు అద్దె ఒప్పందాలకు.. కువైట్ లో కొత్త నిబంధనలు..!!

- December 08, 2024 , by Maagulf
కారు అద్దె ఒప్పందాలకు.. కువైట్ లో కొత్త నిబంధనలు..!!

కువైట్: వినియోగదారుల రక్షణను మెరుగుపరిచే లక్ష్యంతో వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ కారు అద్దె ఒప్పందాల కోసం కొత్త నిబంధనలను ప్రకటించింది. కొత్త నిబంధనలలో ప్రామిసరీ నోట్ల వాడకంపై నిషేధం విధించారు. తప్పనిసరిగా సమగ్ర బీమా, కారు డెలివరీ/రిటర్న్ లను  ఫోటోగ్రాఫ్‌లతో డాక్యుమెంట్ చేయాల్సి ఉంటుంది. తాజా నిబంధనలు కారు అద్దె ఒప్పందాలను క్రమబద్ధీకరించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ జియాద్ అల్-నజీమ్ ప్రకటించారు.  

అద్దెకు తీసుకున్న వ్యక్తి కారును సౌండ్ మెకానికల్ కండిషన్‌లో డెలివరీ చేయాలని నిర్దేశించారు. అదేసమయంలో అద్దె కార్లు అన్ని భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని, అత్యవసర పరికరాలతోపాటు స్పేర్ టైర్లు వంటి అవసరమైన అన్నింటిని కలిగి ఉండాలని నిర్దేశించారు.  డెలివరీకి ముందు, కారు పరిస్థితిని తెలిపేలా ఫోటోలు/వీడియోల రూపంలో డాక్యుమెంట్ తయారు చేయాలి. ముందుగా ఉన్న ఏవైనా నష్టాలను ఒప్పందంలో స్పష్టంగా వెల్లడించాలి. అద్దె వ్యవధిలో ఏదైనా కొత్త నష్టం సంభవించినట్లయితే, నష్ట అంచనా ధరను నిర్ణయించడానికి అధికారులకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు.  

అయితే, కారుకు ప్రమాదం జరిగినప్పుడు, అద్దెదారు అంతర్గత మంత్రిత్వ శాఖ నుండి మరమ్మతుల కోసం ఆమోదం పొందాల్సి ఉంటుంది.  భీమా ఫైల్‌ను ఓపెన్ అయ్యే ఖర్చుతో పాటు ఒప్పందంలో పేర్కొన్న అంగీకార మొత్తాన్ని భరించాలి. అద్దెదారు వ్రాతపూర్వక అనుమతి లేకుండా మరమ్మతులు చేయడాన్ని నిషేధించారు. అద్దెకు తీసుకున్న వారి కారణంగా కారు సీజ్ అయితే, అద్దెకు తీసుకున్న వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని కొత్త నిబంధనల్లో పేర్కొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com