మసీదుల వద్ద రాంగ్ పార్కింగ్‌కి జరీమానా
- June 26, 2016
సార్జా పోలీసులు 200 దిర్హామ్‌ల నుంచి 500 దిర్హామ్‌ల వరకు వాహనదారులకు జరీమానా విధిస్తున్నారు. మసీదుల వద్ద ఇష్టమొచ్చినట్లుగా తమ వాహనాలను పార్కింగ్ చేస్తుండడం వల్ల తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టే దిశగా నడుం బిగించారు షార్జా పోలీసులు. జరీమానాతోపాటు 4 బ్లాక్ పాయింట్స్‌ని కూడా మోటరిస్టుల ఖాతాలో వేయడం జరుగుతుంది. తరావీ ప్రార్థనల సమయంలో గడచిన పది రోజుల్లో వాహనదారులు మసీదుల వద్ద క్రమపద్ధతిని పాటించకుండా వాహనాల్ని పార్కింగ్ చేయడంపై పోలీసులు సీరియస్‌గా స్పందించారు. వాహనాల్ని ఇష్టమొచ్చినట్లు పార్క్ చేయడం వల్ల రోడ్లపై వెళ్ళేవారికి ఇబ్బందికరంగా మారుతోందనీ, రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని షార్జా పోలీస్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెంట్రల్ ఆపరేషన్స్ కల్నల్ అరిఫ్ అల్ షరీఫ్ చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







