పవన్ కళ్యాణ్ వచ్చే నెల 9 న బ్రిటన్ వెళ్తున్నాడు..

- June 26, 2016 , by Maagulf
పవన్ కళ్యాణ్ వచ్చే నెల 9 న బ్రిటన్ వెళ్తున్నాడు..

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చే నెల 9 న బ్రిటన్ వెళ్తున్నాడు. లండన్ లో ప్రవాసాంధ్రులు నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో పవన్ పాల్గొంటాడని తెలుస్తోంది. మొదట యునైటెడ్ కింగ్ డమ్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ (యుక్తా) ఆధ్వర్యంలో జరిగే జయతే కూచిపూడి ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి చీఫ్ గెస్టు గా హాజరవుతాడని సమాచారం.
అలాగే ట్రోక్సీ లో జరిగే ఆరో వార్షికోత్సవానికి కూడా పవన్ అటెండ్ అవుతున్నాడని తెలిసింది. యుకె, యూరప్ దేశాల్లో తన ఫ్యాన్స్ ఏర్పాటు చేసే ముఖాముఖి ప్రోగ్రాం లో కూడా పవన్ పాల్గొని వారితో మమేకమవుతాడట.యుక్తా కు చెందినా గుంటుపల్లి జయకుమార్ ఆధ్వర్యంలో పవన్ పర్యటనకు సంబందించిన ఏర్పాట్లు జరుగు తున్నాయని తెలిసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com