ఒమన్‌కి సౌదీ కొత్త రోడ్ లింక్
- June 26, 2016
ఒమన్‌ని కలిపేందుకు 680 కిలోమీటర్ల కొత్త రహదారిని ఈ ఏడాదిలో ప్రారంభించనున్నట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. ఈ రోడ్డుకు సంబంధించి 97 శాతం పనులు పూర్తయినట్లు సౌదీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ సులేమాన్ అల్ హమదాన్ చెప్పారు. కొత్త రోడ్డు మార్గం అందుబాటులోకి వస్తే సుమారు 500 కిలోమీటర్ల మేర సౌదీ - ఒమన్‌ల మధ్య దూరం తగ్గుతుందని ఆయన చెప్పారు. ఇబ్రి ప్రావిన్స్‌లోని తనమ్ ఏరియాలో ప్రారంభమవుతుందని, ఎంప్టీ క్వార్టర్‌గా పేరొందిన అతి పెద్ద ఎడారి దగ్గర ఇది సౌదీ అరేబియాలో కలుస్తుందని అధికారిక వర్గాలు చెప్పాయి. ఒమన్ ఈ రహదారి కోసం 200 మిలియన్ ఒమని రియాల్స్ (1.9 బిలియన్ దిర్హామ్స్) ఖర్చు చేస్తుంది. ఒమన్‌లో 160 కిలోమీటర్ల మేర ఈ రహదారి ఉంటుంది. సౌది అరేబియా 1 బిలియన్ సౌదీ రియాల్స్ ఖర్చుతో తమ భూభాగంలో 566 కిలోమీటర్ల మేర రహదారిని నిర్మిస్తోంది. రెండేళ్ళ సమయంలో ఒమన్ తన భూభాగంలోని రహదారిని నిర్మిస్తుండగా, సౌదీ అరేబియా నాలుగేళ్ళ సమయం తీసుకుంది. కొత్త రహదారి ద్వారా ఇరు దేశాల మధ్యా వాణిజ్య సంబంధాలు ఇంకా మెరుగువుతాయని వాణిజ్య రంగ నిపుణులు చెప్పారు. క్యాటిల్ ట్రేడింగ్, అగ్రికల్చర్, ఆటోమొబైల్ వ్యాపారాలు ఈ రహదారి ద్వారా ఎక్కువ లబ్ది పొందనున్నాయి
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







