మసీదుల వద్ద రాంగ్‌ పార్కింగ్‌కి జరీమానా

- June 26, 2016 , by Maagulf
మసీదుల వద్ద రాంగ్‌ పార్కింగ్‌కి జరీమానా



సార్జా పోలీసులు 200 దిర్హామ్‌ల నుంచి 500 దిర్హామ్‌ల వరకు వాహనదారులకు జరీమానా విధిస్తున్నారు. మసీదుల వద్ద ఇష్టమొచ్చినట్లుగా తమ వాహనాలను పార్కింగ్‌ చేస్తుండడం వల్ల తలెత్తుతున్న ట్రాఫిక్‌ సమస్యలకు చెక్‌ పెట్టే దిశగా నడుం బిగించారు షార్జా పోలీసులు. జరీమానాతోపాటు 4 బ్లాక్‌ పాయింట్స్‌ని కూడా మోటరిస్టుల ఖాతాలో వేయడం జరుగుతుంది. తరావీ ప్రార్థనల సమయంలో గడచిన పది రోజుల్లో వాహనదారులు మసీదుల వద్ద క్రమపద్ధతిని పాటించకుండా వాహనాల్ని పార్కింగ్‌ చేయడంపై పోలీసులు సీరియస్‌గా స్పందించారు. వాహనాల్ని ఇష్టమొచ్చినట్లు పార్క్‌ చేయడం వల్ల రోడ్లపై వెళ్ళేవారికి ఇబ్బందికరంగా మారుతోందనీ, రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని షార్జా పోలీస్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సెంట్రల్‌ ఆపరేషన్స్‌ కల్నల్‌ అరిఫ్‌ అల్‌ షరీఫ్‌ చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com