వాంటెడ్ బెల్జియన్ డ్రగ్ కింగ్ దుబాయ్‌లో అరెస్ట్..!!
- December 10, 2024
Photo: X/Dubai Media Office
దుబాయ్: బెల్జియం మోస్ట్ వాంటెడ్ ఇంటర్నేషనల్ డ్రగ్ ట్రాఫికర్లలో ఒకరైన ఒత్మాన్ ఎల్ బల్లౌటిని దుబాయ్‌లో అరెస్టు చేశారు. ఈ మేరకు దుబాయ్ పోలీసులు డిసెంబర్ 9 న ధృవీకరించారు. అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో అనేక కేసులు ఎదుర్కొంటున్న అతనిపై బెల్జియన్ అధికారులు అంతర్జాతీయ రెడ్ నోటీసును జారీ చేశారు.
ఇంటర్‌పోల్, యూరోపోల్ వాంటెడ్ లిస్ట్‌లలో మోస్ట్ వాంటెడ్ అయిన ఎల్ బల్లౌటి, యూరప్‌లోని ప్రధాన డ్రగ్ గేట్‌వేలలో ఒకటైన బెల్జియన్ పోర్ట్ ఆఫ్ ఆంట్‌వెర్ప్‌లో ప్రధాన డ్రగ్ స్మగ్లింగ్ రింగ్‌ను నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే, తాము అతనిని బెల్జియన్ కు అప్పగించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు న్యాయశాఖ తెలిపింది. బెల్జియం -యూఏఈ 2021లో అప్పగింత ఒప్పందంపై సంతకం చేశాయి.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







