భవిష్యత్తు ప్రణాళికలను వెల్లడించిన ఎమిరేట్స్ డ్రా..!!
- December 10, 2024
యూఏఈ: యూఏఈలో తన కార్యకలాపాలను నిలిపివేసిన తర్వాత ఎమిరేట్స్ డ్రా విస్తరణ వ్యూహం ప్రణాళికలను ప్రకటించింది. కమర్షియల్ గేమింగ్ రెగ్యులేటరీ అథారిటీ (GCGRA) ఇటీవలి నిబంధనలకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించింది. యూఏఈలో తమ కార్యకలాపాలను పాజ్ చేసామని, అంతర్జాతీయ మార్కెట్లోకి ప్రవేశించనున్నట్లు తెలిపింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 175 దేశాలలో తమ కార్యక్రమాలను విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఎమిరేట్స్ డ్రా ప్రకటించింది. టైచెరోస్ కింద పని చేస్తున్న ఎమిరేట్ డ్రా, 'లిటిల్ డ్రా' పేరుతో లాటరీని కూడా నిర్వహిస్తుంది. ప్రతి టిక్కెట్ మూడు వేర్వేరు డ్రాలకు అనుమతి ఉంటుంది. ప్రతిరోజూ $272,257 వరకు బహుమతులు అందుబాటులో ఉన్నాయని తెలిపింది.
ఎమిరేట్స్ డ్రా గ్లోబల్ ఎంటిటీగా మారింది. “మేము ఇప్పుడు ప్రత్యేకంగా డిజిటల్ స్పేస్లో పనిచేస్తున్నాము. మా ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు అందిస్తున్నాము. అయితే, యూఏఈ నివాసితులు ఇకపై ఎమిరేట్స్ డ్రా వెబ్సైట్ను యాక్సెస్ చేయలేరు. డ్రాలలో పాల్గొనలేరు. యూఏఈలో ఫిజికల్ టిక్కెట్లు కూడా అందుబాటులో ఉండవు” అని ఎమిరేట్స్ డ్రా ప్రతినిధి తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







