Dh1.5 మిలియన్ గోల్డ్ బహుమతులను గెలుచుకోండిలా..!!
- December 11, 2024
దుబాయ్: దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ 30వ ఎడిషన్‌లో భాగంగా దుబాయ్ జువెలరీ గ్రూప్ (డిజెజి) 1.5 మిలియన్ దిర్హామ్‌ల బంగారు బహుమతులను ప్రకటించింది. జనవరి 12, 2025 వరకు జరిగే దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ (DSF) సమయంలో అవుట్లెట్లలో ఆభరణాల కోసం Dh1,500 లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేసే కస్టమర్లు తమ వంతుగా 1.5 మిలియన్ దిర్హామ్‌ల బంగారాన్ని గెలుచుకునే అవకాశం ఉంది. ప్రతి వారం, రాఫిల్ డ్రాలలో 1 కిలోల బంగారం బహుమతిగా అందజేస్తారు. 20 మంది విజేతలు ఒక్కొక్కరికి 1/4 కిలోలు ఇవ్వనున్నారు. వీక్లీ డ్రాలు డిసెంబర్ 13, 20, 27, జనవరి 3, 12 తేదీలలో షెడ్యూల్ ఉంటాయి.
వీటితోపాటు ఎంపిక చేసిన వజ్రాలు, ముత్యాల ఆభరణాలపై 50 శాతం వరకు తగ్గింపు, ఎంపిక చేసిన బంగారు అభరణాలపై 1-5 శాతం మధ్య మేకింగ్ ఛార్జీల తగ్గింపు, పాత బంగారం ఎక్స్ఛేంజీలపై సున్నా వెయిటేజీ, ఎంపిక చేసిన కొనుగోళ్లతో ప్రత్యేక బహుమతులు అందుకోవచ్చు. 85కి పైగా ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్లు, 275 రిటైల్ జ్యువెలరీ అవుట్లెట్లు ప్రమోషన్లో భాగం అవుతున్నాయని దుబాయ్ జువెలరీ గ్రూప్‌లోని బోర్డ్ మెంబర్ & మార్కెటింగ్ కమిటీ చైర్పర్సన్ లైలా సుహైల్ వెల్లడించారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







