దెయిరాలో కొత్తగా 7-అంతస్తుల పార్కింగ్ టెర్మినల్..!!
- December 11, 2024
యూఏఈ: దుబాయ్‌లోని అల్ సబ్‌ఖా ప్రాంతంలో 350 పార్కింగ్ స్లాట్లతో కూడిన ఏడు అంతస్తుల స్మార్ట్ పార్కింగ్ సదుపాయాన్ని నిర్మించనున్నారు. ఈ మేరకు పబ్లిక్ పార్కింగ్ ఆపరేటర్ పార్కిన్ కంపెనీ ప్రకటించింది. రద్దీగా ఉండే దీరా జిల్లాలో ఉన్న ఈ ప్రాంతంలో కొత్త మల్టీ లెవెల్ కార్ పార్క్ అభివృద్ధికి దుబాయ్ ఎండోమెంట్స్ అండ్ మైనర్స్ ట్రస్ట్ ఫౌండేషన్ (అవుకాఫ్ దుబాయ్)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఈ పార్కింగ్ సదుపాయం సుమారు 175,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుందని, మరో 9,600 చదరపు అడుగుల గ్రౌండ్ ఫ్లోర్‌లో రిటైల్ స్టోర్లకు కేటాయించినట్టు వెల్లడించింది.ప్లానింగ్ ఆమోదానికి లోబడి, నిర్మాణం 2025 రెండవ అర్ధభాగంలో ప్రారంభమవుతుంది.దీని నిర్మాణ సమయం సుమారు రెండు సంవత్సరాలు ఉంటుందని పార్కిన్ తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







