ఆసియా మార్కెట్లలో పౌండ్ విలువ మరింత పతనం
- June 26, 2016
యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాలంటూ బ్రెగ్జిట్ ఫలితాలు వెలువడ్డాక మొదలైన ఆ దేశ కరెన్సీ పౌండ్ విలువ పతనం ఇంకా కొనసాగుతోంది. బ్రెగ్జిట్ ఫలితాలు వెలువడ్డాక రికార్డు స్థాయిలో 31 ఏళ్ల కనిష్టానికి 10 శాతం పడిపోయిన పౌండ్ విలువ.. సోమవారం ఆసియా మార్కెట్లలో మరింత పతనమైంది. డాలర్లలో పౌండ్ మారకం విలువ 1.3365 వద్ద ట్రేడ్ అయ్యింది. అంటే ఒక పౌండుకు 1.34 డాలర్లు మాత్రమే వస్తాయన్న మాట. గత శుక్రవారంతో పోలిస్తే పౌండ్ విలువ 3 శాతం తగ్గినట్టు బీబీసీ వెల్లడించింది. ఇక యూరోతో పోలిస్తే 1.2147తో ట్రేడ్ అయ్యింది.ఆసియా ఆర్థిక మార్కెట్లలో స్థిరత్వం కోసం అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. జపాన్ ప్రధాని షింజో అబె శనివారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సమీక్షించారు. కరెన్సీ మార్కెట్లు స్థిరంగా ఉండేందుకు అవసరమైనన్ని చర్యలు తీసుకుంటామని జపాన్ ఆర్థిక మంత్రి టరో అసో చెప్పారు. కాగా కొన్ని నెలల్లో పౌండ్ విలువ మరింత పతనమవుతుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







