సూపర్ డాన్సర్ కాంపిటీషన్ : డాన్స్ లవర్స్ కు అద్భుతమైన వేదిక!
- December 11, 2024
దోహా: ఎమోట్ ఎడిషన్ డ్యాన్స్ స్టూడియోతో కలిసి దోహా మ్యూజిక్ లవర్స్ నిర్వహించిన సూపర్ డాన్సర్ కాంపిటీషన్ (సీజన్ 3), దోహాలోని MIE SPPU పూణే విశ్వవిద్యాలయంలో గ్రాండ్ ఫినాలేతో ముగిసింది.ఈ కార్యక్రమంలో ప్రదర్శించిన వైవిధ్యమైన డాన్సులు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మూడు వారాల పాటు జరిగిన ఈ కాంపిటీషన్లో పాల్గొనేందుకు వందలాది మంది డ్యాన్సర్లు ఆడిషన్లలో పాల్గొన్నారు. శాస్త్రీయ, జానపద, సినిమా మరియు పాశ్చాత్య డ్యాన్స్ రూపాల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ విస్తృతమైన టాలెంట్ పూల్ నుండి, పిల్లలు, సబ్-జూనియర్లు, జూనియర్లు, యుక్తవయస్కులు మరియు సీనియర్లు అనే విభాగాల్లో పోటీ పడుతున్న 80 మంది పార్టిసిపెంట్లు ఫైనల్స్ లో ప్రదర్శన ఇవ్వడానికి ఎంపికయ్యారు.
ఫైనల్స్ చూసేందుకు వందలాది మంది యూనివర్సిటీ ఆడిటోరియంకు తరలివచ్చారు. అయితే, ప్రేక్షకుల తాకిడి ఆడిటోరియం సామర్థ్యానికి మించి ఉండటంతో సెక్యూరిటీ సిబ్బంది చాలా మందిని వెలుపలే ఆపేయడం జరిగింది. దీని వల్ల ఎక్కువ మంది ఆడియన్స్ ఫైనల్స్ ను వీక్షించలేకపోయారు. అనంతరం దోహా మ్యూజిక్ లవర్స్ ప్రెసిడెంట్ సయ్యద్ రఫీ మాట్లాడుతూ ఈ ఈవెంట్‌ను సూపర్ సక్సెస్ చేయడానికి కృషి చేసిన మొత్తం బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, ఈవెంట్ సాఫీగా జరిగేందుకు తమ వంతు సహకారాన్ని అందించిన ఎమోట్ ఎడిషన్ డ్యాన్స్ స్టూడియో డైరెక్టర్స్ జ్యోతి, సంగీత గార్లకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా సయ్యద్ రఫీ మాట్లాడుతూ.. ఈ కాంపిటీషన్ సృజనాత్మకత, సంస్కృతికి సంబంధించిన వేడుక అని పేర్కొన్నారు. అలాగే, ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొన్న వారందరి ప్రతిభకు తగినట్లుగా ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించడాన్ని చూస్తుంటే కంటెస్టెంట్ల మీద వారు చూపించిన ప్రేమకు నిదర్శనం. ఈ కాంపిటీషన్ జడ్జస్ గా శరత్ నాయర్, మనోజ్ కుమార్, గినేష్, రేఖ, స్వప్న, భావన మరియు మామణి వ్యవహరించారు.
ఈ కార్యక్రమానికి ఖతార్ తెలుగు సంఘం ప్రముఖుడు కోడూరు శివరామ్ ప్రసాద్, ఐసిసి మాజీ ప్రధాన కార్యదర్శి కృష్ణ కుమార్, రేడియో 107 FM RJ నాజియా అహమ్మద్, తెలుగు కళా సమితి అధ్యక్షులు హరీష్ రెడ్డి, మలబార్ గోల్డ్ & డైమండ్స్ జనరల్ మేనేజర్ సంతోష్ తదితరులు హాజరయ్యారు.వారందరికి రఫీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
అప్కామింగ్ డ్యాన్సర్లు తమ ప్రతిభను ప్రదర్శించడానికి సూపర్ డ్యాన్సర్ కాంపిటీషన్ ఒక గొప్ప వేదిక. అలాగే, ఈ వేదిక ద్వారా డ్యాన్స్ లవర్స్ ను ఆహ్లాదపరచడమే కాకుండా వారికి మరింత చేరువయ్యేలా మార్గం సుగమం అయ్యింది. తదుపరి ఎడిషన్ నిర్వహణ కోసం ఇప్పటికే ప్రణాళికలు జరుగుతున్నాయి అని, రాబోయే రోజుల్లో ఈ డ్యాన్స్ వేడుకను మరింత గ్రాండ్ గా నిర్వహిస్తామని ప్రకటించారు.
ఈ కార్యక్రమానికి యాంకర్స్ గా వ్యవహరించిన మొహిందర్ జలంధరి, క్రిస్టినా మరియు సంగీతలు తమ యాంకరింగ్ తో ప్రేక్షకులను అలరించారు. సయ్యద్ రఫీ తన టీమ్ సభ్యులైన రవి, సారా అలీ ఖాన్, బాసిత్ పఠాన్, అబ్దుల్ అసిమ్, విశాలాక్షి నారా, నూర్ అఫ్షాన్, జ్యోతి మరియు సంగీతలను ప్రశంసించారు. వీరి కృషి, డెడికేషన్ వల్లే సూపర్ డ్యాన్సర్ కాంపిటీషన్ సూపర్ సక్సెస్ అయ్యిందని అని తెలిపారు
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి