వ్యక్తిగత ఆదాయపు పన్నుపై ముసాయిదా చట్టం..చర్చించిన స్టేట్ కౌన్సిల్..!!

- December 12, 2024 , by Maagulf
వ్యక్తిగత ఆదాయపు పన్నుపై ముసాయిదా చట్టం..చర్చించిన స్టేట్ కౌన్సిల్..!!

మస్కట్: స్టేట్ కౌన్సిల్ కీలక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా "వ్యక్తిగత ఆదాయపు పన్ను చట్టం" ముసాయిదా సంస్కరణలపై చర్చించారు.  కౌన్సిల్ చైర్మన్ షేక్ అబ్దుల్మలిక్ అబ్దుల్లా అల్ ఖలీలీ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది.  కౌన్సిల్ ఆఫ్ ఒమన్ లాలోని ఆర్టికల్ 49లోని నిబంధనలకు అనుగుణంగా "వ్యక్తిగత ఆదాయపు పన్ను చట్టం" ముసాయిదా సంస్కరణను మంత్రుల మండలి సూచించిందని అల్ ఖలీలీ చెప్పారు.

స్టేట్ కౌన్సిల్ ఆర్థిక కమిటీ చట్టం ఆదాయ వనరులను వైవిధ్యపరచడానికి, చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, సమాజంలోని విభాగాల మధ్య సంపదను పునఃపంపిణీ చేయడానికి ప్రయత్నిస్తుందని ఈ సందర్భంగా సూచించారు. సోషల్ ప్రొటెక్షన్ సిస్టమ్‌కు ఆర్థిక సహాయం చేయడానికి, కంపెనీలు / సంస్థలపై ఆదాయపు పన్ను ఎగవేతను ఎదుర్కోవడంలో ప్రభుత్వ సామర్థ్యాన్ని పెంచడానికి కూడా చట్టం ఉపయోగపడుతుందని కమిటీ వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com