ఇండియా,కువైట్ ఆధ్వర్యంలో హైడ్రోకార్బన్‌లపై కీలక సమావేశం..!!

- December 12, 2024 , by Maagulf
ఇండియా,కువైట్ ఆధ్వర్యంలో హైడ్రోకార్బన్‌లపై కీలక సమావేశం..!!

కువైట్: ఇండియా, కువైట్ ఆధ్వర్యంలో హైడ్రోకార్బన్స్‌పై 7వ జాయింట్ వర్కింగ్ గ్రూప్ (JWG) సమావేశం జరిగింది. భారత పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి (IC) ఈషా శ్రీవాస్తవ,  కువైట్ చమురు మంత్రిత్వ శాఖ సెక్రటరీ ఖలీద్ అల్-దేయిన్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా చమురు, గ్యాస్, పెట్రోకెమికల్స్, వ్యూహాత్మక నిల్వలు, గ్రీన్ హైడ్రోజన్‌, జీవ ఇంధనాలు, పునరుత్పాదక శక్తితో సహా తక్కువ-కార్బన్ సొల్యూషన్స్ ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించారు.  ఏటా ఫ్లాగ్‌షిప్ ఎనర్జీ ఈవెంట్‌పై చర్చలు జరపడానికి ఇరుపక్షాలు ఆసక్తిని వ్యక్తం చేశాయి. 2025, ఫిబ్రవరిలో ఇండియా ఎనర్జీ వీక్ సందర్భంగా G20 ప్రెసిడెన్సీలో గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్‌లో సభ్యత్వం కోసం కువైట్ ఆసక్తిని వ్యక్తం చేసింది.  సహకరించాలని భారత్ మద్దతును కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com