యూఏఈ పౌరుల కోసం శుభవార్త తెలిపిన హంగరీ..!!
- December 13, 2024
యూఏఈ: యూఏఈ సిటిజన్స్ ఇక నుండి(డిసెంబర్ 12నుండి) హంగేరిలోని అన్ని విమానాశ్రయాలలో ఇ-గేట్‌లను యాక్సెస్ చేయవచ్చని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ చర్య రెండు దేశాల మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలను నొక్కి చెబుతుందని, సహకారాన్ని పెంపొందించడంలో వారి పరస్పర నిబద్ధతను హైలైట్ చేస్తుందని తెలిపింది. ఇది యూఏఈ వాసులకు వేగవంతమైన, మరింత సమర్థవంతమైన అనుభవాన్ని అందిస్తుందన్నారు. అంతర్జాతీయ సమాజంలో యూఏఈ ఖ్యాతీని ఇది మరింత పెంచుతుందన్నారు.
పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రకారం.. డిసెంబర్ 2024 నాటికి యూఏఈ పాస్‌పోర్ట్ ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానంలో ఉంది. యూఏఈ పాస్‌పోర్ట్ హోల్డర్ 180 దేశాలకు ప్రయాణించవచ్చు. 127 దేశాలు వీసా-రహిత ప్రయాణాన్ని అందిస్తాయి. 47 విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు eVisa లేదా వీసాను అందిస్తాయి. 18 దేశాలలో మాత్రమే పౌరులు ముందస్తు వీసా పొందాల్సి ఉంటుంది. అలాగే ఆరు దేశాలకు ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ (ETA) అవసరం అవుతుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- భారత్లో త్వరలో 2 కొత్త ఎయిర్లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్
- 'అటల్ స్మృతి న్యాస్ సొసైటీ' అధ్యక్షులుగా వెంకయ్యనాయుడు
- 22 సెంచరీలతో హజారే ట్రోఫీ ప్రారంభం
- 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్
- ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకం: మంత్రి పార్థసారధి
- కేంద్రం పరిచయం చేస్తున్న ‘భారత్ టాక్సీ’ యాప్
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!







