గోల్డ్ స్మగ్లింగ్ స్కామ్లో BD 26,000 జరిమానాలు..!!
- December 13, 2024
మనామా: ట్రావెల్ టికెట్ స్కామ్ లో నిందితులకు భారీ జరిమానా విధించారు. విదేశాలకు బంగారం తరలించిన నగల దుకాణం యజమాని, ముగ్గురు వ్యక్తులకు క్రిమినల్ కోర్టు మొత్తం BD 26,000 జరిమానా విధించింది. ఈ మేరకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకటించింది.
దుకాణ యజమానికి BD 10,000 జరిమానా విధించగా, అతని ఇద్దరు సహచరులకు కలిపి BD 15,000 జరిమానా విధించారు. నాల్గవ నిందితుడికి బిడి 1,000 చెల్లించాలని కోర్టు ఆదేశించింది. నిందితులపై మనీలాండరింగ్, లైసెన్స్ లేని వ్యాపారం చేస్తున్నట్లు కేసులు నమోదు చేశారు. అనంతరం షాపులోని బంగారు నగలతోపాటు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ నేషనల్ సెంటర్ (FINC) జరిపిన విచారణతో స్మగ్లింగ్ రాకెట్ బయటపడింది. దుకాణం యజమాని నకిలీ ఇన్వాయిస్ల ద్వారా బంగారు ఆభరణాలను విదేశాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు.
తాజా వార్తలు
- భారత్లో త్వరలో 2 కొత్త ఎయిర్లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్
- 'అటల్ స్మృతి న్యాస్ సొసైటీ' అధ్యక్షులుగా వెంకయ్యనాయుడు
- 22 సెంచరీలతో హజారే ట్రోఫీ ప్రారంభం
- 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్
- ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకం: మంత్రి పార్థసారధి
- కేంద్రం పరిచయం చేస్తున్న ‘భారత్ టాక్సీ’ యాప్
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!







