మంగళగిరి ఎయిమ్స్ సభ్యులు గా ఎంపి బాలశౌరి
- December 14, 2024
మచిలీపట్టణం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన మంగళగిరి ఎయిమ్స్ కు సభ్యులుగా మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి ఎన్నిక అయ్యారు.
శుక్రవారం తో ముగిసిన ఎన్నిక ప్రక్రియలో మంగళగిరి ఎయిమ్స్ పరిపాలన కమిటీ సభ్యులుగా లోక్ సభ తరఫున మచిలీపట్నం ఎంపి బాలశౌరి, విజయవాడ ఎంపి కేశినేని శివనాధ్ అలియాస్ చిన్ని ఎన్నిక అయ్యారు.
2014 సంవత్సరం జులై లో 2014-15 కేంద్ర బడ్జెట్ సెషన్ నందు అప్పటి ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ 500 కోట్లతో మంగళగిరిలో ఎయిమ్స్ సంస్థ ను స్థాపించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ప్రకటించారు. ఫె్జ్ 4 లో భాగంగా నాలుగు రాష్ట్రాలలో అనగా ఆంధ్రప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ మరియు మహారాష్ట్ర లలో ఎయిమ్స్ కేంద్రాలను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరి లో 183 ఎకరాల సువిశాల విస్తీర్ణం ను ఎయిమ్స్ నిర్మాణం కోసం ఎన్నుకున్నారు.
2015 అక్టోబర్ లో 1618 కోట్ల అంచనా వ్యయంతో ఎయిమ్స్ నిర్మాణానికి కేంద్ర కాబినెట్ ఆమోదం ముద్ర వేసింది. అప్పటి కేంద్ర వైద్య మంత్రి శ్రీ జెపి. నడ్డా, ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరిగింది.
2017 సెప్టెంబర్ నెలలో పర్మినెంట్ క్యాంపస్ నిర్మాణ పనులను ప్రారంభించారు.
2018-19 లో విజయవాడ సిద్ధార్ధ మెడికల్ కాలేజీ లోని తాత్కాలిక క్యాంపస్ నందు 50 మంది స్టూడెంట్స్ తో అకాడమీక్ సెషన్ ప్రారంభించారు. తరువాత పర్మినెంట్ క్యాంపస్ లో 125 మంది విద్యార్థులతో 2020-21 లో మొదటి బ్యాచ్ ఆరంభించారు.
2019 మార్చి నెలలో అవుట్ పేషంట్ విభాగాన్ని, 2021 జనవరి లో ఇన్ పేషంట్ విభాగాన్ని ఆరంభించి, చాలా తక్కువ ధరలకే అత్యంత ఆధునిక వైద్యం గుంటూరు మరియు చుట్టు పక్కల జిల్లాల ప్రజలకు అందిస్తున్నారు.
ఇటువంటి ప్రతిష్టాత్మక మైన మంగళగిరి ఎయిమ్స్ అడ్మినిస్ట్రేటివ్ కమిటీ లో లోక్ సభ తరఫున సభ్యునిగా ఎంపి బాలశౌరి ఎన్నిక కావడం వలన గుంటూరు మరియు కృష్ణా జిల్లాల ప్రజలకు మరింత మెరుగైన వైద్య సౌకర్యాలు లభించే అవకాశం కలుగుతుంది.
ఎయిమ్స్ సభ్యునిగా తన ఎంపిక పట్ల అమెరికా పర్యటనలో ఉన్నఎంపి బాలశౌరి కేంద్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి తన కృతజ్ఞతలు తెలియచేశారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి