జైలు నుంచి విడుదలయ్యాక తొలిసారి మీడియాతో మాట్లాడిన అల్లు అర్జున్..
- December 14, 2024
హైదరాబాద్: సినీ హీరో అల్లు అర్జున్ చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. శనివారం ఉదయం ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. జైలు వెనుక గేటు నుంచి బయటకు వచ్చిన అల్లు అర్జున్ ఎస్కార్ట్ వాహనం ద్వారా గీతాఆర్ట్స్ కార్యాలయంకు వెళ్లారు. అక్కడ సుమారు 45 నిమిషాల పాటు న్యాయవాది నిరంజన్ రెడ్డితో చర్చించారు. బెయిల్ వచ్చినా జైలు నుంచి విడుదల ఆలస్యంపై చర్చించినట్లు తెలుస్తోంది. అనంతరం అక్కడి నుంచి జూబ్లిహిల్స్ లోని తన నివాసానికి వెళ్లారు. జైలు నుంచి ఇంటికి వచ్చిన అల్లు అర్జున్ కు కుటుంబ సభ్యులు దిష్టితీసి స్వాగతం పలికారు. సతీమణి స్నేహారెడ్డి, ఆయన పిల్లలు అల్లు అర్జున్ ను హత్తుకొని కన్నీరు పెట్టుకున్నారు. కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. కుటుంబ సభ్యులతో మాట్లాడిన అనంతరం అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు.
అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతూ ‘‘ నేను బాగానే ఉన్నాను.. అభిమానులు ఆందోళన చెందొద్దు. నాకు అండగా నిలిచిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. నేను చట్టాన్ని గౌరవిస్తా. చట్టానికి కట్టుబడి ఉంటా. బాధిత కుటుంబానికి జరిగిన నష్టం పూడ్చలేనిది. ఆ కుటుంబానికి మరోసారి సానుభూతి తెలుపుతున్నా. వారికి అండగా ఉంటాను. నేను సినిమా చూసేందుకు వెళ్లినప్పుడు అనుకోకుండా ఘటన జరిగింది. అది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. 20ఏళ్లుగా థియేటర్ కు వెళ్లి సినిమా చూస్తున్నా.. నా సినిమాలే కాదు.. మావయ్య సినిమాలూ చూశా. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదు. తొక్కిసలాట ఘటన దురదృష్టకరం.’’ అని అల్లు అర్జున్ అన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ
- మస్కట్ నైట్స్ 2026 జనవరిలో ప్రారంభం..!!
- కువైట్ లో వీసా కోసం..ఆరోగ్య బీమా రుసుములు పెంపు..!!
- బహ్రెయిన్ కాఫీ ఫెస్టివల్లో విజయం..నేపాలీ బారిస్టాస్ కు సత్కారం..!!
- సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రులు భేటీ..!!
- మ్యాచ్ ఫర్ హోప్ 2026..యూట్యూబ్ స్టార్ మిస్టర్బీస్ట్ ఖరారు..!!
- షేక్ హమ్దాన్ ను కలిసిన ఎలోన్ మస్క్..!!
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?







