డొనాల్డ్ ట్రంప్ మరో నిర్ణయం
- December 14, 2024
అమెరికా: త్వరలో అమెరిగా అధ్యక్షుడుగా ప్రమాణస్వీకారం చేయనున్న డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు అసౌకర్యంగా మారిన డే లైట్ సేవింగ్ టైమ్ ను రద్దు చేయనున్నట్లు ప్రకటించారు. డే లైట్ సేవింగ్ టైమ్ వల్ల అమెరికన్లపై చాలా భారం పడుతోందని ఆరోపించారు. రిపబ్లికన్ ప్రభుత్వం ఇలాంటి వాటిని సరిచేసి ప్రజలకు మరింత సౌకర్యవంతమైన పాలన అందించేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తాను ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన వెంటనే ఈ నిర్ణయం అమలు చేయడానికి ప్రయత్నిస్తానని వివరించారు. దీంతో ఏటా రెండుసార్లు టైమ్ ను సరిచేసుకునే ఇబ్బంది నుంచి ప్రజలకు విముక్తి కలుగుతుందని, దేశంపై ఆర్థిక భారం కూడా తగ్గుతుందని ట్రంప్ వివరించారు.
ఈ మార్పుతో ప్రజలకు సౌకర్యం
అమెరికా సంయుక్త రాష్ట్రాల విస్తీర్ణం చాలా ఎక్కువనే విషయం తెలిసిందే. యూఎస్ఏలోని కొన్ని ప్రాంతాలు వివిధ టైమ్ జోన్ లలో ఉన్నాయి. ఈ క్రమంలోనే పగటిపూట సమయాన్ని ఆదా చేసే ఉద్దేశంతో తీసుకొచ్చిందే ‘డే లైట్ సేవింగ్ టైమ్’(డీఎస్ టీ). దీని ప్రకారం.. మార్చిలో పగటి పూట వెలుతురు ఎక్కువగా ఉన్నపుడు గడియారాన్ని ఒక గంట ముందుకు జరుపుతారు. తిరిగి నవంబర్ లో ఒక గంట వెనక్కి జరుపుతారు. దీని ఉద్దేశం పగటి సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడమే. ఏటా మార్చి రెండవ ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో గడియారాన్ని గంట ముందుకు తిప్పి 3 గంటలు చూపించేలా మార్చుతారు. తిరిగి నవంబర్ మొదటి ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో గడియారాన్ని 1 గంట చూపించేలా మార్చేస్తారు. ఈ విధానం ప్రజలకు అసౌకర్యంగా వుండడంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి