అల్లు అర్జున్ అరెస్ట్ కు రేవంత్ రెడ్డి ఎంతవరకు కారణం..?
- December 14, 2024
డిసెంబర్ 4, 2024న పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడంతో పాటు ఆమె కుమారుడు శ్రీతేజ్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు.ఈ ఘటనకు కారణమైనందుకు అల్లు అర్జున్‌ను డిసెంబర్ 13న చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్కడ అల్లు అర్జున్ రాక గురించి ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుందనే ఆరోపణలు వచ్చాయి. అయితే అల్లు అర్జున్ అరెస్టులో నిజంగా ఆయన తప్పు ఉందా ? లేదా అనే విషయంపై అనేక ప్రశ్నలు ఉన్నాయి.
సాధారణంగా ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు పోలీసులు కేసు నమోదు చేస్తారు. ఇది ప్రమాద తీవ్రత, కారణాలు, మరియు బాధితుల పరిస్థితులను ఆధారపడి ఉంటుంది. అలాగే సంధ్య థియేటర్ దగ్గర ఒక ప్రాణం పోయినప్పుడు పోలీసులు కేసు పెట్టడం తప్పనిసరి అయింది. ఇది బాధితుల కుటుంబానికి న్యాయం చేయడానికి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండటానికి పోలీసులు ఇలాంటి చర్యలు తీసుకుంటారు. ఇంతవరకు ఓకే. కానీ అసలు ఈ తొక్కిసలాటకు కారణం? మహిళ ప్రాణాలు పోవడానికి కారణం ఎవరు అనేదే ముఖ్యమైన పృశ్న. ఈ విషయాలకు అల్లు అర్జున్ కు సంబంధం ఉందా? లేదా? ఈ విషయాలకు సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం సరైందా కాదా అంటే..
ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు పోలీసులు కేసు పెడతారా లేదా? కేసు పెడితే ఎవరి పై పెట్టాలి?
ఇక సంధ్య థియేటర్ దగ్గర ఒక ప్రాణం పోయినప్పుడు పోలీసులు కేసు పెట్టాలా వద్దా ?
మరి కేసు పెడితే ఎవరిపై పెట్టాలి? తోపులాటకు కారణం అయిన వారి పైనే కదా ? మరి తోపులాటకు కారణం ఎవరు? థియేటర్ యజమానియా? పోలీసులా? అల్లు అర్జున్ యా ?
అయితే పోలీసులకు సమాచారం ఇచ్చాం అని థియేటర్ యాజమాన్యం చెబుతోంది? అసలు పోలీసులకు థియేటర్ యాజమన్యం ఏమని సమాచారం ఇచ్చారు? రెండు రోజులకు పోలీసు బందోబస్త్ ఇవ్వమని. అసలు బందోబస్తు దేని కోసం? పుష్ప అప్పుడే రిలీజ్ అయ్యింది.. జనం ఎక్కువ వస్తే కంట్రోల్ చేయడానికి అని. ఇవన్నీ సహజంగా ప్రతి ఒక్కరికీ వచ్చే ప్రశ్నలే.
అయితే సహజంగా పెద్ద సినిమాలు విడుదల సందర్భంగా ప్రతి థియేటర్ యాజమాన్యం ఇలాగే చేస్తుంది. దీనికి పోలీసులు కూడా పోలీసులు ఒక నలుగురు అయిదుగురు సిబ్బందిని పంపి చేతులు దులుపుకుంటారు. కానీ పుష్ప 2 విడుదల సందర్భంగా జరిగింది వేరు. అల్లు అర్జున్ వస్తున్నట్టు టైం తో సహా బయటికి వచ్చేలా లీక్ చేసింది ఆయన టీం. అందుకే సాధారణంగా ఉండే ప్రేక్షకుల కన్న, పది రెట్లు ఎక్కువ జనం వచ్చారు.
అసలే ఇరుకు రోడ్లు.. దీంతో క్రౌడ్ ఎక్కువగా పెరిగి తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఓ మహిళ ప్రాణం పోగా ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ తొక్కిసలాటకు ప్రత్యక్షంగా పరోక్షంగా అల్లు అర్జున్ కారణం అయ్యారు. దీంతో పోలీసులు ఆల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు.
పోలీసులకే కంట్రోల్ కాని విధంగా అంత మంది అక్కడకు చేరుకోవడానికి ప్రధాన కారణం అల్లు అర్జున్ కాదా? పోలీసులు అల్లు అర్జున్ పై కాకుండా ఇంకెవరిపై కేసు నమోదు చేయాలి. ఇక్కడ పోలీసులు తీసుకున్న నిర్ణయం 100% సరైందే. అల్లు అర్జున్ అవగాహన రాహిత్యమో.. లేక ప్రతిసారి సినిమా విడుదల సమయంలో అభిమానుల తాకిడి ఇలాగే ఉంటుంది ఇది సహజమే అని అనుకున్నాడో.. కారణం ఏదైప్పటికీ ఈ ఘటనకు కారణం మాత్రం ఆయనే. పోలీసులు ఆయనపై కేసు నమోదు చేయడమే కరక్టే. దీనిలో రాజకీయ కోణం కానీ, రేవంత్ రెడ్డి నిర్ణయం ఏమి లేదు. పోలీసులు వారి పని వారు చేశారు.
ఇటీవల కాలంలో పోలీసులు దేవర సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ గురించి తీసుకున్న నిర్ణయం సంఘటన తెలుసుకోవాలి. హైదరాబాద్ లోని ఒక హోటల్ లో దేవర సినిమా ఫంక్షన్ కి పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. కక్కుర్తి తో నిర్వాహకులు కెపాసిటీ కంటే డబల్ పాసులు జారీ చేశారు. చివరి నిమిషంలో పోలీసులు జూనియర్ ఎన్టీఆర్ కి ఫోన్ చేసి రావొద్దు అన్నారు. పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించిన జూనియర్ ఎన్టీఆర్ వెనక్కి తగ్గి ఆగిపోయారు. లేదంటే ఇంకో ప్రాణం పోయేదేమో. అభిమానుల తాకిడి విషయంలో అల్లు అర్జున్ కు ఏమాత్రం తీసిపోరు జూనియర్ ఎన్టీఆర్. అలాంటిది ఈ ఈవెంట్ క్యాన్సీల్ అవడంతో ఎంతో బాధపడ్డారు కూడా. అప్పుడు కూడా చంద్రబాబుకి పర్మిషన్ కి లింక్ పెడుతూ ఈ ప్రభుత్వాన్నే తిట్టారు. ఇప్పుడు కూడా అదే రిపీట్. అల్లు అర్జున్ కి ఆంధ్రకి ఏమి సంబంధం? వైస్సార్సీపీ ఏమైనా ఇక్కడ పోటీ చేసే పార్టీ కాదు కదా ? ఇక్కడ చట్టం తన పని తాను చేసింది అంతే.
ఈ సంఘటనలో తోపులాటకు కారణం అయిన వారి పైనే కేసు పెట్టాలి. అదే జరిగింది. ఇప్పటికే థియేటర్ యజమాని, మేనేజర్‌ను కూడా అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్‌పై నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంలో కారణం ఎవరు అనేది నిర్ధారించడానికి పోలీసులు విచారణ చేస్తారు. థియేటర్ యజమాని, పోలీసులు, లేదా అల్లు అర్జున్ ఎవరు బాధ్యులు అనేది విచారణలో తేలుతుంది.
యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు చెబితే, ఆ సమాచారం ఏమిటి అనేది కూడా విచారణలో భాగంగా ఉంటుంది. పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు, సాధారణంగా పోలీసులు బందోబస్త్ ఏర్పాటు చేస్తారు. కానీ, అల్లు అర్జున్ వస్తున్నట్లు ముందుగా తెలిసి, ఎక్కువ మంది గుమిగూడడం వల్ల ఈ సంఘటన జరిగింది.
సాధారణంగా, సినిమా నటులు ప్రేక్షకుల మధ్య సర్ప్రైజ్ లాగా కనిపిస్తారు. కానీ, ఈసారి ముందుగా చెప్పడం వల్ల ఎక్కువ మంది గుమిగూడారు.ఈ పరిస్థితిని కంట్రోల్ చేయడం కష్టమైంది. ఇలాంటి సంఘటనల్లో, రాజకీయాలు ఆడకుండా, పోలీసులకు వారి విధులు నిర్వర్తించడానికి అవకాశం ఇవ్వాలి. ప్రతి సంఘటనకు సిస్టమ్ పై ఒత్తిడి పెడితే, మొత్తం వ్యవస్థ కుప్పకూలుతుంది.
--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







