చెక్-ఇన్ సమయాల్లో కీలక మార్పులు చేసిన ఎయిరిండియా

- December 14, 2024 , by Maagulf
చెక్-ఇన్ సమయాల్లో కీలక మార్పులు చేసిన ఎయిరిండియా

న్యూ ఢిల్లీ: విమాన ప్రయాణాల్లో ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపరచడానికి ఇంకా విమానాశ్రయాల్లో గందరగోళ రద్దీని తగ్గించడానికి దేశీయ ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా తన చెక్-ఇన్ సమయాలను సవరించింది. ప్రయాణికుల అనుభవాన్ని మరింత సౌకర్యవంతంగా, సమర్థవంతంగా మార్చడానికి, విమానాశ్రయ విధానాలను క్రమబద్ధీకరించడానికి ఎయిర్ ఇండియా కొన్ని కీలక మార్పులు చేసింది. 

షెడ్యూల్ ప్రకారం విమానాలు బయలుదేరడానికంటే 75 నిమిషాల ముందే చెక్-ఇన్ కౌంటర్లు మూసివేస్తారు. గతంలో ఇది 60 నిమిషాలుగా ఉండేది. ఈ కొత్త నియమం ద్వారా ప్రయాణికులు రద్దీ సమయాల్లో చెక్-ఇన్, సెక్యూరిటీ క్లియరెన్స్ల కోసం తగిన సమయం పొందగలుగుతారు. ప్రయాణికులు సవరించిన చెక్-ఇన్ సమయానికి అనుగుణంగా ముందుగానే విమానాశ్రయానికి చేరుకోవాలని ఎయిరిండియా సూచించింది. అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించాలనుకునేవారు షెడ్యూల్ సమయం కంటే దాదాపు 3 గంటల ముందుగానే విమానాశ్రయానికి చేరుకోవడం మంచిదని పేర్కొంది.

ఢిల్లీ మరియు లండన్ హీత్రూ విమానాశ్రయాల్లో ఈ మార్పులు ప్రధానంగా అమలులోకి వచ్చాయి.మొదటగా చెక్-ఇన్ సమయాలను ముందుగానే ప్రారంభించడం ద్వారా ప్రయాణికులు ఎక్కువ సమయం పొందగలుగుతున్నారు. ఇది వారికి విమానాశ్రయంలో ఇతర అవసరాలను తీర్చుకోవడానికి, భద్రతా తనిఖీలను సులభంగా పూర్తి చేసుకోవడానికి సహాయపడుతుంది. ఇంకా ఎయిరిండియా తన సిబ్బందిని మరింత శిక్షణ ఇచ్చి, ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించడానికి చర్యలు తీసుకుంది. మొత్తానికి, ఈ మార్పులు ఎయిరిండియా ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన, సమర్థవంతమైన సేవలను అందించడానికి చేసిన ప్రయత్నాలు. ఈ మార్పుల ద్వారా ప్రయాణికులు తమ ప్రయాణాన్ని మరింత సులభంగా, ఆనందంగా అనుభవించగలుగుతారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com