‘ఛలో ఢిల్లీ’ ర్యాలీలో ఉద్రిక్తత
- December 14, 2024
న్యూ ఢిల్లీ: కనీస మద్దతు ధరకు చట్టబద్ధతతో పాటు పలు డిమాండ్ల సాధనే లక్ష్యంగా రైతులు శనివారం పునఃప్రారంభించిన ‘ఛలో ఢిల్లీ’ ర్యాలీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చాలాకాలంగా రైతులు తమ డిమాండ్స్ కోసం ఉద్యమం చేస్తున్నారు. శనివారం మరోసారి రైతులు ఉద్యమం చేసేందుకు ముందుకు వచ్చారు. అయితే రైతుల పాదయాత్రను భద్రతా సిబ్బంది అనుమతించలేదు. హర్యానా-పంజాబ్ సరిహద్దులో రైతులను చెదరగొట్టేందుకు హర్యానా పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ ఫిరంగులను ప్రయోగించారు. ఈ పాదయాత్రలో 101 మంది రైతులు పాల్గొనగా దాదాపు 10 మంది రైతులు గాయపడ్డారు. దీంతో మరోసారి ‘ఛలో ఢిల్లీ’ యాత్రను నిలిపివేస్తూ రైతులు నిర్ణయించుకున్నారు.
బజరంగ్ పునియా శంభు విమర్శలు
కాగా, కాంగ్రెస్ నేత, మాజీ రెజ్లర్ బజరంగ్ పునియా శంభు సరిహద్దులో రైతులను కలిసి మాట్లాడారు. రైతులను అడ్డుకోవడం లేదని చెబుతూనే బాష్పవాయువు ప్రయోగిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. శంభు సరిహద్దును పాకిస్థాన్ సరిహద్దులా వ్యవహరిస్తున్నారని, రైతు నేతలు ఢిల్లీ వెళ్లి నిరసన తెలిపేందుకు అనుమతి తీసుకోవాలా అని ప్రశ్నించారు.
డిసెంబరు 6న రైతులు ‘ఛలో ఢిల్లీ’ నిరసన ర్యాలీ మొదలుపెట్టారు. అయితే శంభు సరిహద్దులో పోలీసులు అడ్డుకుంటున్నారు. డిసెంబరు 6, 8 తేదీలలో కూడా రైతులను భద్రతా సిబ్బంది అనుమతించలేదు. దీంతో ఇవాళ మరోసారి ప్రయత్నించారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







