మోహన్‌బాబును అందుకే అరెస్టు చేయలేదు: రాచకొండ సీపీ

- December 16, 2024 , by Maagulf
మోహన్‌బాబును అందుకే అరెస్టు చేయలేదు: రాచకొండ సీపీ

హైదరాబాద్: మోహన్‌బాబును అరెస్టు చేయడంలో నెలకొన్న జాప్యంపై రాచకొండ సీపీ సుధీర్‌బాబు స్పందించారు. మోహన్‌బాబు అరెస్ట్ విషయంలో ఎలాంటి ఆలస్యం లేదని, ఆయన దగ్గర మెడికల్ రిపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉందని అందుకే అరెస్టు విషయంలో ఆలస్యం అవుతుందని చెప్పారు. ఇప్పటికే అరెస్టు గురించి మోహన్‌బాబుకు నోటీసులు ఇచ్చామని సీపీ వివరించారు.ఈ వివాదంలో మోహన్ బాబు పైన మూడు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసినట్లు తెలిపారు.

మొదట, మోహన్ బాబు తన నివాసం వద్ద ఒక మీడియా ప్రతినిధిని కొట్టడంతో, ఆయనపై కేసు నమోదు అయింది. ఈ ఘటనతో పాటు, మోహన్ బాబు తన చిన్న కొడుకు మనోజ్‌పై ప్రాణహాని ఉందని కంప్లైంట్ ఇచ్చారు. మనోజ్ కూడా తన కుటుంబ సభ్యులతో తన భార్య, పిల్లలకు థ్రెట్ ఉందని రోడ్డెక్కాడు.

ఇప్పటికే, మోహన్ బాబు ఫ్యామిలీపై మూడు కేసులు నమోదయ్యాయి. హత్యాయత్నంతో పాటు మరో రెండు కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదైందని సీపీ సుధీర్ బాబు తెలిపారు. మోహన్ బాబు అరెస్ట్ విషయంలో ఎలాంటి ఆలస్యం లేదని, ఆయనకు ఇప్పటికే నోటీసు ఇచ్చామని, కానీ డిసెంబర్ 24 వరకు సమయం అడిగారని వివరించారు. కోర్టు సమయం ఇచ్చింది కాబట్టి మేము అరెస్ట్ చేయలేదని, విచారణపై కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.

మోహన్ బాబు దగ్గర రెండు గన్స్ ఉన్నాయని, అందులో ఒకటి డబుల్ బ్యారెల్, మరొకటి స్పానిష్ మేడ్ రివాల్వర్ అని తెలిపారు. రాచకొండ పరిధిలో ఆయనకు గన్ లైసెన్స్ లేదని, లైసెన్స్డ్ గన్స్‌ను సరెండర్ చేయాలని కోరారు. మోహన్ బాబు తన పీఆర్వో ద్వారా డబుల్ బ్యారెల్ గన్‌ను చంద్రగిరి పోలీసులకు అప్పగించారు.

మొత్తం మీద, మోహన్ బాబు ఫ్యామిలీపై నమోదైన కేసులు, వారి మధ్య విభేదాలు, మరియు కోర్టు విచారణలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ నెల 24 లోపు విచారణ జరగకపోతే, మోహన్ బాబును అరెస్ట్ చేస్తామని సీపీ సుధీర్ బాబు స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com