వీసా క్షమాభిక్ష స్కీమ్.. ఓవర్స్టేయర్లకు ఫైనల్ కాల్..!!
- December 17, 2024
యూఏఈ: వీసా క్షమాభిక్ష డిసెంబర్ 31తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) అలెర్ట్ జారీ చేసింది. వీసా క్షమాభిక్ష ముగిసేలోపు ఉపయోగించుకోవాలని అక్రమంగా నివసిస్తున్న వారికి సూచించింది. సెప్టెంబరు 1న క్షమాభిక్ష పథకం ప్రారంభమైంది. ఓవర్స్టేయర్లు తమ స్టేటస్‌ను క్రమబద్ధీకరించుకోవడానికి లేదా జరిమానాలను ఎదుర్కోకుండా వారి స్వదేశాలకు తిరిగి రావడానికి మరింత సమయాన్ని అందించడానికి వీలుగా ఇప్పటికే ఒకసారి తుది గడువును పొడిగించారు. GDRFA డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ మర్రి ఓవర్స్టేయర్లకు చివరి అప్పీల్ చేశారు. “క్షమాభిక్ష ముగియబోతోంది, ఇంకా తమ హోదాను క్రమబద్ధీకరించని ఓవర్స్టేయర్లు వారి రెసిడెన్సీని సరిదిద్దడానికి గ్రేస్ పీరియడ్ మిగిలిన సమయాన్ని ఉపయోగించుకోవాలి." అని సూచించారు. వయోలేటర్స్ అండ్ ఫారినర్స్ ఫాలో-అప్ సెక్టార్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ సలాహ్ అల్ కమ్జీ మాట్లాడుతూ.. తుది గడువు అనంతరం తనిఖీలను ముమ్మరం చేస్తామన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







