ఆన్లైన్లో షాపింగ్ చేసే పర్యాటకుల కోసం VAT రీఫండ్..!!
- December 17, 2024
యూఏఈ: యూఏఈలోని పర్యాటకులు తమ దేశంలో ఉన్న సమయంలో చేసిన ఇ-కామర్స్ కొనుగోళ్లపై త్వరలో విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ని తిరిగి పొందవచ్చని అధికారులు ప్రకటించారు. ఈ కొత్త ఇ-కామర్స్ VAT రీఫండ్ సిస్టమ్ ఫెడరల్ టాక్స్ అథారిటీ (FTA)తో రిజిస్టర్ చేయబడిన ప్లాట్‌ఫారమ్‌లు, ఇ-స్టోర్లు యూఏఈలో ఉన్నప్పుడు పర్యాటకులు వారి ఆన్లైన్ కొనుగోళ్లపై VAT రీఫండ్లను పొందవచ్చు. కొత్త పన్ను విధానం పర్యాటకుల కోసం కొనుగోలు నుండి రీఫండ్ వరకు ప్రక్రియను సులభతరం చేస్తుందన్నారు.
యూఏఈలోని పర్యాటకులు నేరుగా రిజిస్టర్డ్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా VAT వాపసు అభ్యర్థనలను సమర్పించవచ్చు. ట్రావెల్ డాక్యుమెంట్స్ వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని అందించాలి. పర్యాటకుల గుర్తింపు ధృవీకరించబడిన తర్వాత, వారు దేశం విడిచి వెళ్లినప్పుడు రీఫండ్ ప్రక్రియ పూర్తవుతుంది. రెండేళ్ళ క్రితం ప్రారంభించిన డిజిటల్ ట్యాక్స్ రీఫండ్ సిస్టమ్ విజయవంతం కావడంతో కొత్త విధానాన్ని రూపొందించారు. ఇది వాపసు ప్రక్రియను వేగంగా చేస్తుందని అధికారులు తెలిపారు. కొత్త స్కీమ్ ప్రపంచ పర్యాటక కేంద్రంగా యూఏఈ ఖ్యాతిని మరింత పెంచుతుందని FTA డైరెక్టర్ జనరల్ ఖలీద్ అలీ అల్ బుస్తానీ తెలిపారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్‌ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







