ఖోర్ ఫక్కన్‌లో విషాదం. బస్సు బోల్తా పడి 9 మంది మృతి..!!
- December 17, 2024
యూఏఈ: ఖోర్ ఫక్కన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం భవన నిర్మాణ కార్మికులతో వెళ్తున్న బస్సు బోల్తా పడడంతో తొమ్మిది మంది మృతి చెందగా, పలువురికి గాయాలు అయ్యాయి. షార్జా పోలీసులు ప్రమాదాన్ని ధృవీకరించారు. బ్రేకులు ఫెయిల్ కావడంతో బస్సు బోల్తా పడిందని, 73 మంది ప్రయాణికులను సురక్షితంగా రక్షించినట్టు తెలిపారు. ఖోర్ ఫక్కన్ నగరం ఎంట్రీ పాయింట్ అయిన వాడి విషీ స్క్వేర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించి, వారిని చికిత్స కోసం ఆసుపత్రులకు తరలించినట్టు ఈస్టర్న్ రీజియన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ డాక్టర్ అలీ అల్ హమౌడీ తెలిపారు. బ్రేకులు ఫెయిల్ కావడంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడని ప్రాథమికంగా తేలిందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!