ఒమానీ-సౌదీ సంయుక్త సైనిక డ్రిల్.. ‘సాలిడారిటీ 1’ ప్రారంభం..

- December 17, 2024 , by Maagulf
ఒమానీ-సౌదీ సంయుక్త సైనిక డ్రిల్.. ‘సాలిడారిటీ 1’ ప్రారంభం..

రియాద్: ఒమానీ-సౌదీ సంయుక్త సైనిక డ్రిల్ "సాలిడారిటీ 1" సౌదీ అరేబియా (KSA) లో ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 26 వరకు కొనసాగే ఈ డ్రిల్‌లో రాయల్ ఆర్మీ ఆఫ్ ఒమన్ (RAO) 23వ ఆర్మీ బ్రిగేడ్‌కు చెందిన ఒమన్ కోస్ట్ రెజిమెంట్ పాల్గొంటుంది. సౌదీ అరేబియా 20వ బ్రిగేడ్ 2వ రెజిమెంట్ పాల్గొంటుంది. సాలిడారిటీ/1 అనేక ఉమ్మడి సైనిక ప్రణాళికల అమలు, క్షేత్ర శిక్షణను కలిగి ఉంటుంది. డ్రిల్ నిర్వహించడం అనేది ఒమన్ - అరబ్ మరియు స్నేహపూర్వక దేశాల మధ్య నైపుణ్యాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి.. సైనిక సహకారాన్ని పెంపొందించుకోవడంలో భాగమని అధికార యంత్రాంగం వెల్లడించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com