తొలిసారిగా దుబాయ్ లో డ్రోన్ డెలివరీ సేవలు ప్రారంభం..!!
- December 18, 2024
దుబాయ్: దుబాయ్ లో తొలిసారిగా డ్రోన్ సేవలు ప్రారంభమయ్యాయి. డ్రోన్ల ద్వారా మెడిసిన్, పార్శిళ్ల డెలివరీని దుబాయ్ మంగళవారం అధికారికంగా ప్రారంభించారు. దుబాయ్ సిలికాన్ ఒయాసిస్ (DS)లో ఉత్పత్తులను డెలివరీ చేయడానికి దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (DCAA) కీటా డ్రోన్‌కు మొదటి లైసెన్స్‌ను అందించింది. ప్రారంభ దశలో ఆరు డ్రోన్‌లను వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దుబాయ్, అబుదాబి ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి డ్రోన్లు, ప్లైయింగ్ కార్ల వంటి కొత్త రవాణా మార్గాలపై ఫోకస్ చేసినట్టు అథారిటీ తెలిపింది.
రోచెస్టర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (RIT-దుబాయ్), దుబాయ్ డిజిటల్ పార్క్ వంటి కీలక ప్రదేశాలలో ఫుడ్, మెడిసిన్, ఇతర అవసరమైన వస్తువులను వేగంగా డెలివరీ చేయడానికి నాలుగు కార్యాచరణ డ్రోన్ డెలివరీ మార్గాలను దుబాయ్ సిలికాన్ ఒయాసిస్ (DSO) లో ఆవిష్కరించారు. ఫకీ యూనివర్శిటీ హాస్పిటల్.. అమెరికానా, రోచెస్టర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో తన సహకారంతో కీటా డ్రోన్ అత్యవసర సేవలు, అధిక ప్రాధాన్యత కలిగిన మెడికల్ డెలివరీలతో సహా డ్రోన్ టెక్నాలజీని వినియోగంలోకి తీసుకొచ్చింది. దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ డైరెక్టర్ జనరల్ మొహమ్మద్ అబ్దుల్లా లెంగావి మాట్లాడుతూ.. డెలివరీ సిస్టమ్ పూర్తిగా సురక్షితమన్నారు. గత ఏడాదిన్నరగా ప్రయోగాత్మక పరీక్షలు నిర్వహించామని తెలిపారు. తాము ప్రస్తుతం ఆరు డ్రోన్‌లతో సిలికాన్ ఒయాసిస్‌లో నాలుగు మార్గాలను కలిగి ఉన్నామని, త్వరలోనే ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామన్నారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







