43 ఏళ్ల తర్వాత కువైట్ పర్యటనకు వెళ్లనున్న భారత ప్రధాని
- December 18, 2024
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 21 నుంచి 22 వరకు తొలిసారి కువైట్లో అధికారిక పర్యటన చేయనున్నారు. 1981లో ఇందిరా గాంధీ పర్యటన అనంతరం దాదాపు 43 ఏళ్ల తర్వాత భారత ప్రధాని కువైట్లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ పర్యటనలో ఆయన కువైట్ అమీర్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా, క్రౌన్ ప్రిన్స్ షేక్ సబా అల్-ఖాలీద్, మరియు ప్రధాని అహ్మద్ అల్ అబ్దుల్లా అల్ సబాహ్ వంటి ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. మోదీ ఈ పర్యటనలో భారతీయ కమ్యూనిటీ సంఘాలను ఉద్దేశించి హవల్లిలోని కోర్ట్యార్డ్ ఇండోర్ స్టేడియంలో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. కువైట్లో దాదాపు 10 లక్షలమంది భారతీయులు నివసిస్తున్నారు.
డిసెంబర్ మూడో వారంలో జరగనున్న సౌదీ అరేబియా పర్యటన మధ్య మోడీ కువైట్ పర్యటన ఉంది. గత వారం భారత్లో పర్యటించిన కువైట్ విదేశాంగ మంత్రి అబ్దుల్లా యాహ్యా కువైట్లో పర్యటించాల్సిందిగా నరేంద్ర మోదీకి ఆహ్వానం అందజేశారు. కువైట్ నాయకత్వం అందించిన ఆహ్వానాన్ని అంగీకరించి ప్రధానమంత్రి మోదీ ఈ పర్యటనకు సిద్దమయ్యారు. ఈ పర్యటన ద్వారా భారతదేశం మరియు కువైట్ మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలు మరింత బలపడతాయని, ఇరువురు దేశాల ప్రజలకు కూడా ప్రయోజనం కలిగిస్తుందని ఆశిస్తున్నారు.
ఈ పర్యటనలో ప్రధానమంత్రి మోది కువైట్ ఎమిర్, షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-సబాతో సహా కువైట్ ప్రభుత్వ నాయకత్వంతో పలు కీలక అంశాలపై చర్చలు జరపనున్నారు. ముఖ్యంగా, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, వ్యాపారం, పెట్టుబడులు, ఇంధనం, టెక్నాలజీ, సంస్కృతి వంటి రంగాల్లో సహకారాన్ని పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా ఉంది. ఈ పర్యటన ద్వారా భారతదేశం మరియు కువైట్ మధ్య ఉన్న సంబంధాలు మరింత బలపడతాయని, వ్యాపారం, పెట్టుబడులు, ఇంధనం వంటి రంగాల్లో సహకారం మరింత పెరుగుతుందని ఆశిస్తున్నారు.
ప్రధానమంత్రి మోదీ కువైట్లో నివసిస్తున్న భారతీయుల సంక్షేమం పట్ల కువైట్ నాయకత్వం చూపిస్తున్న శ్రద్ధకు ధన్యవాదాలు తెలియజేయనున్నారు. ఈ పర్యటన ద్వారా భారతదేశం మరియు కువైట్ మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలు మరింత బలపడతాయని ప్రధానమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు







