ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- January 13, 2026
మస్కట్ః ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. అంతర్గత మంత్రి సయ్యద్ హమౌద్ బిన్ ఫైసల్ అల్ బుసైది దీనిని ప్రారంభించారు. ఇది ఒమన్ సుల్తానేట్‌లో జాతీయ ఆరోగ్య భద్రతా వ్యవస్థలో ఒక ప్రాథమిక భాగంగా ఉంటుందని పేర్కొన్నారు. జనవరి నెలలో మూడు కీలకమైన ఆరోగ్య అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించామని తెలిపారు. ఒమన్ విజన్ 2040 ప్రధాన ప్రాధాన్యతలలో ఆరోగ్యం ఒకటి అని పేర్కొన్నారు.
సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ఒమన్ ఆరోగ్య రంగంలో అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టులలో ఒకటి అని ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని ఇంజనీరింగ్ వ్యవహారాల మంత్రి కార్యాలయ సలహాదారు డాక్టర్ అలీ బిన్ అబ్దుల్‌హుస్సేన్ అల్-లావతి తెలిపారు. OMR18.2 మిలియన్ల అంచనా వ్యయంతో దీనిని నిర్మించినట్లు పేర్కొన్నారు. హై-సెక్యూరిటీ ప్రయోగశాలలు మరియు వైరాలజీ, బాక్టీరియాలజీ, కెమిస్ట్రీ, టాక్సికాలజీ, న్యూ బర్న్స్ స్క్రీనింగ్, బయోఇన్ఫర్మేటిక్స్ రంగాలలో ప్రత్యేక ప్రయోగశాలలు ఉన్నాయని ఆయన వివరించారు. మాలిక్యులర్, మైక్రోబయోలాజికల్, సెరోలాజికల్ మరియు కెమికల్ పరీక్షలు వంటి అధునాతన రిఫరెన్స్ పరీక్షలు నిర్వహిస్తారని డిసీజ్ సర్వైలెన్స్ అండ్ కంట్రోల్ సెంటర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జకారియా బిన్ యాహ్యా అల్ బలూషి తెలిపారు. సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ అంటు వ్యాధుల నిర్ధారణతో జాతీయ ఎపిడెమియోలాజికల్ నిఘా కార్యక్రమాలకు మద్దతు ఇస్తుందని అన్నారు.
తాజా వార్తలు
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం







