వైకుంఠ ఏకాదశి ఏర్పాట్ల పై TTD EO సమీక్ష
- December 18, 2024
తిరుమల: వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై టీటీడీ ఈఓ జె.శ్యామలరావు సమీక్ష నిర్వహించారు. జె.శ్యామలరావు అదనపు ఈఓ సి.హెచ్.వెంకయ్యతో కలిసి తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఈ సమీక్ష నిర్వహించారు. ఈ భేటీలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, సీవీఎస్ఓ శ్రీధర్, అన్ని విభాగాల అధిపతులు పాల్గొన్నారు.
టీటీడీ తీసుకున్న ముఖ్య నిర్ణయాలివే..
23న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల శ్రీవాణి టికెట్లు ఆన్ లైన్ లో విడుదల, 24న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల ఎస్ఈడీ టికెట్లు ఆన్ లైన్ లో విడుదల. జనవరి 10 నుంచి 19 వరకు పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి తిరుపతిలో 8 కేంద్రాలు, తిరుమలలో ఒక కేంద్రంలో ఎస్ఎస్డీ టోకెన్లు కేటాయింపు. తిరుపతిలో ఎం.ఆర్. పల్లి, జీవకోన, రామా నాయుడు స్కూల్, రామచంద్ర పుష్కరిణీ, ఇందిరా మైదానం, శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనంలో టోకెన్ల కేటాయింపు.
ప్రోటోకాల్ దర్శనాలు
వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 9 నుండి 11 గంటలు వరకు స్వర్ణ రథం.
వైకుంఠ ద్వాదశి రోజున ఉదయం 5.30 నుంచి 6.30 వరకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం.
గోవిందమాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన సదుపాయం ఉండదు.
అన్న ప్రసాదాలు పంపిణీ
ఉదయం 6 నుంచి రాత్రి 12 గంటల వరకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు పంపిణీ చేయాలని కేటరింగ్ అధికారులకు ఆదేశం.టీ, కాఫీ, పాలు, ఉప్మా, చక్కెర పొంగలి, పొంగలి పంపిణీ.లడ్డూ ప్రసాదం కోసం భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ప్రతిరోజూ అందుబాటులో 3.50 లక్షల లడ్డూలు.
తాజా వార్తలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..







