ఆఫ్ఘనిస్థాన్‌లో రెండు ప్రమాదాలు..52 మంది మృతి
- December 19, 2024
ఆప్ఘనిస్థాన్: ఆప్ఘనిస్థాన్‌లో ఘోరప్రమాదం జరిగింది. ఇక్కడ జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 52 మంది దుర్మరణం పాలయ్యారు.మరో 76 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాబూల్-కాందహార్ హైవేపై గత రాత్రి ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.
మరో ప్రమాదంలో మహిళలు, పిల్లలు
ఇదే హైవేపై మరో ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు ఘటనల్లో కలిపి మొత్తంగా 52 మంది మృతి చెందారు. గాయపడిన 76 మందిని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నట్టు అధికారులు చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్‌లో రోడ్లు అధ్వానంగా ఉన్న కారణంగా అక్కడ ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. ఈ ప్రమాదాలకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది. ఇక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరణాల సంఖ్య పెరిగేలా ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. గాయపడిన వారు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
తాజా వార్తలు
- తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- యూఏఈ లాటరీ కొత్త వీక్లీ ఫార్మాట్ కింద మొదటి లక్కీ డే ఫలితాలు..!!
- మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- ఒమన్ లో వింటర్ పర్యాటక ప్రమోషన్ ప్రారంభం..!!
- కువైట్ లో డ్రగ్స్ డంప్ బస్ట్..భారీగా డ్రగ్స్ సీజ్..!!
- పలు దేశాధినేతలతో అమీర్ సమావేశం..!!
- సీఎం చంద్రబాబు–నజీర్: పాలన అంశాలపై టాప్ లెవల్ మీటింగ్
- ఉగ్రవాదుల చెరలో తెలంగాణ యువకుడు
- ఫ్లైట్ టికెట్ ధరల పెంపు పై కేంద్రం సీరియస్..
- అత్తలూరి విజయ లక్ష్మి సాహితీ స్వర్ణోత్సవం సందడి







