కెనడాలో గాజువాక యువకుడు మృతి..రంగంలోకి లోకేష్‌!

- December 19, 2024 , by Maagulf
కెనడాలో గాజువాక యువకుడు మృతి..రంగంలోకి లోకేష్‌!

కెనడా: కెనడాలో తెలుగోడు మరణించాడు. అనుమానస్పద రీతిలో కెనడాలో తెలుగోడు మృతి చెందాడు.కెనడాలో గాజువాకకు చెందిన యువకుడు అనుమానస్పద మృతి చెందాడు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉన్నత చదువులు కోసం కెనడా విశాఖ యువకుడు ఫణికుమార్ (33) వెళ్లారు.హాస్టల్ లో నిద్రిస్తూ అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు ఫణికుమర్. నిద్రలో గుండె పోటుతో యువకుడు మృతి చెందాడని తల్లిదండ్రులుకి ఫోన్ చేసి చెప్పారు ఫణికుమర్ మిత్రులు. దీంతో శోకసంద్రంలోకి ఫణికుమర్ తల్లిదండ్రులు వెళ్లిపోయారు.మా అబ్బాయి మృతదేహాన్ని తీసుకురావడానికి సహకరించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు ఫణికుమార్ తల్లిదండ్రులు. దీంతో రంగంలోకి దిగారు ఏపీ మంత్రి నారా లోకేష్‌.  ఫణికుమార్ మృతి బాధాకరం అన్నారు  మంత్రి నారా లోకేష్. వారి తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ ఎక్స్ లో పోస్ట్ చేశారు  మంత్రి నారా లోకేష్. ఫణికుమార్ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు  మంత్రి నారా లోకేష్.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com