షిర్డీ సాయి ఆలయం ఆ వేళ మూసివేత
- December 20, 2024
షిర్డీ: షిర్డీ సాయి ఆలయం ట్రస్టు బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఏడు దశాబ్దాలకు పైగా షిర్డీ ఆలయం కోట్లాది మంది భక్తులు దర్శించుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా భక్తులు తరలి వస్తున్నారు. కాగా, ఆలయంలో సాయినాథుని విగ్రహాన్ని త్రీడీ స్కానింగ్ చేయాలని నిర్ణయించారు. ఇందు కోసం ఈ రోజు (శుక్రవారం) ఆలయం మూడు గంటలు మూసి వేస్తున్నట్లు వెల్లడించారు. భవిష్యత్ లో ఖచ్చితమైన ప్రతిరూపాన్ని తీర్చి దిద్దే ఆలోచనలో ఆలయ ట్రస్టు బోర్డు కసరత్తు చేస్తోంది.
సాయినాధుని విగ్రహం పరిశీలన
షిర్డీ ఆలయంలోని సాయి బాబా విగ్రహానికి అధికారులు 3డీ స్కానింగ్ చేయిస్తున్నారు. 70ఏళ్ల క్రితం ఇటాలియన్ మార్బుల్తో తయారు చేసిన ఈ విగ్రహం ప్రస్తుత పరిస్థితిని కచ్చితంగా అంచనా వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏడు దశాబ్దాల క్రితం షిర్డీలో సాయిబాబా పాలరాతి విగ్రహం ఏర్పాటు చేసారు. భవిష్యత్ లో ఖచ్చితమైన ప్రతిరూపాన్ని సిద్దం చేయటంతో పాటుగా ప్రస్తుత విగ్రహం పరిస్థితిని అంచనా వేసేందుకు 3డీ స్కానింగ్ చేస్తున్నారు. సాయిబాబా విగ్రహాని కి పాలు, నీళ్లతో నిరంతరం అభిషేకం నిర్వహిస్తూ ఉంటారు.
త్రీ డీ స్కాన్ ద్వారా గుర్తింపు
ఈ కారణంగా విగ్రహం క్రమం దెబ్బ తిన్నట్లుగా సంస్థాన్ అధికారులు గుర్తించారు. సాయిబాబా విగ్రహం మొత్తం పాలరాయిలో ఉంటుంది. అయితే, పాలరాయి సహజంగానే చల్లగా ఉండే స్వభావం కావటంతో వేడి నీరు, పాలు, పెరుగు వల్ల విగ్రహం దెబ్బతింటుందని సాయిబాబా సంస్థాన్ ఆలయ అధికారులకు నిపుణులు వివరించారు. విగ్రహం దెబ్బ తినకుండా పాలక వర్గానికి పలు సూచనలు చేసారు. ఆ విధంగానే జాగ్రత్తలు పాటిస్తున్నా.. విగ్రహం దెబ్బ తిన్నట్లు గుర్తించి, కొత్త నిర్ణయాలు తీసుకున్నారు.
మూడు గంటలు ఆలయం మూసివేత
అందులో భాగంగానే షిర్డీలోని సాయిబాబా విగ్రహానికి సంబంధించిన డేటాను త్రీడీ స్కానింగ్ ద్వారా భద్రపరచాలని నిర్ణయించారు. ఈ డేటా ఆధారంగా మళ్లీ అసలైన విగ్రహం ఏర్పాటుకు ఉపకరిస్తుందని చెబుతున్నారు. ఇందు కోసం ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ వాస్తు మ్యూజియం నిపుణులు డిసెంబరు 20న సాయిబాబా పాలరాతి విగ్రహాన్ని త్రిడీ స్కానింగ్ చేయనున్నారు. దీని కారణంగా ఈ రోజు (డిసెంబరు 20) మధ్యాహ్నం 1.45 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ఆలయాన్ని మూసివేయనున్నట్లు సాయి సంస్థాన్ తెలిపింది. ఆ సమయంలో సాయి దర్శనం కోసం భక్తులను అనుమతించమని వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్...
- ఎనిమిది బోర్డులకు డెవలప్మెంట్ అవార్డ్స్ ప్రకటించిన ICC
- హైమా నుండి నిజ్వాకు క్షతగాత్రుల ఎయిర్ లిఫ్ట్..!!
- డిపొర్టీస్ యూఏఈకి తిరిగి రావచ్చా? దరఖాస్తు ఎలా?
- శాశ్వతంగా కన్నుమూసిన ‘స్లీపింగ్ ప్రిన్స్’..!!
- ప్రపంచ వ్యాపార కేంద్రంగా సౌదీ అరేబియా..నైపుణ్య-ఆధారిత వర్క్ పర్మిట్..!!
- ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యానవనం.. "అతీన్ స్క్వేర్" ప్రారంభం..!!
- ఆకస్మిక తనిఖీలు.. 10 టన్నుల కుళ్లిన సీ ఫుడ్ సీజ్..!!
- తెలంగాణ సచివాలయంలో ఈ-పాస్ విధానం..
- హైదరాబాద్లో ఆగస్టు 10న 'రన్ ఫర్ SMA–2025'