ఎయిర్‌ఏషియా టికెట్ ఇప్పుడు కేవలం 786 కేరూపాయలకే
- June 27, 2016
చౌకధరల విమానయాన సంస్థ ఎయిర్‌ఏషియా ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఫ్లై లైక్ ఏ సూపర్‌స్టార్ పేరుతో ప్రకటించిన ఈ ఆఫర్ కింద దేశీయంగా ప్రారంభ టికెట్ ధరను అన్ని పన్నులు కలుపుకొని రూ.786గా నిర్ణయించింది. ఈ ఆఫర్ జూలై 3 వరకు అందుబాటులో ఉండనున్నది. ఈ ఆఫర్ కింద బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 30, 2017లోగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. తమిళ సూపర్‌స్టార్ నటుడు రజినీకాంత్ నటించిన కబాలి సినిమాకోసం సంస్థ రూ.2,999తో ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతోపాటు అంతర్జాతీయ టికెట్లపై కూడా డిస్కౌంట్ ఆఫర్‌ను కల్పించింది. మారిషస్, క్రాబి, లంబోక్, హో చీ మించ్ నగరాలకు టికెట్ ధరను రూ.2,999గా నిర్ణయించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







