ఐఫోన్ ని మరిపించనున్న గూగుల్ ఫోన్
- June 27, 2016
ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ఫోన్లలో నూతన విప్లవాన్ని తీసుకొచ్చింది యాపిల్ ఐఫోన్. ఐఫోన్‌కి పోటీగా ఎన్ని కొత్త ఫోన్లు వచ్చినా.. దానికున్న ఆదరణ మాత్రం తగ్గలేదు. అయితే ఐఫోన్‌కు దీటుగా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురావాలనే ప్రయత్నాల్లో ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్ ఉన్నట్లు సమాచారం.
సొంత స్మార్ట్‌ఫోన్‌ను తయారుచేసే యోచనలో గూగుల్ ఉందని.. ఇది ఐఫోన్‌కు గట్టి పోటీ ఇవ్వగలదని టెక్ నిపుణులు చెబుతున్నారు. గూగుల్ బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్ కోసం మొబైల్ ఆపరేటర్లతో ఆ సంస్థ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఈ కొత్త డివైజ్ ఈ ఏడాది చివరకు విడుదలయ్యే అవకాశం ఉందని 'ది టెలిగ్రాఫ్' పేర్కొంది. యాపిల్ ఐఫోన్‌తో ముఖాముఖి తలపడేందుకు గూగుల్ సిద్ధమైనట్లు మరో సంస్థ 9టు5మ్యాక్ వెల్లడించింది. ఐఓఎస్‌పై యాపిల్ మాదిరిగా మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై మరింత నియంత్రణ సాధించాలని గూగుల్ కోరుకుంటోందని పేర్కొంది.
తాజా వార్తలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!







