కువైట్‌లో జరిగే అరేబియా గల్ఫ్ కప్ ప్రారంభోత్సవానికి హాజరైన ఒమాన్ మినిస్ట్రీ

- December 21, 2024 , by Maagulf
కువైట్‌లో జరిగే అరేబియా గల్ఫ్ కప్ ప్రారంభోత్సవానికి హాజరైన ఒమాన్ మినిస్ట్రీ

మస్కట్: కువైట్‌లో జరుగుతున్న 26వ అరేబియన్ గల్ఫ్ కప్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ ప్రారంభోత్సవంలో ఒమన్ యొక్క  సాంస్కృతిక, క్రీడలు మరియు యువజన శాఖ మంత్రి హెచ్‌హెచ్ సయ్యద్ థియాజిన్ బిన్ హైతం అల్ సెయిడ్ పాల్గొన్నారు. ఒమన్ జాతీయ జట్టు చాలా ఆశలతో ఈ పోటీలోకి ప్రవేశించింది.దాని బలమైన ఫుట్‌బాల్ వారసత్వాన్ని కొనసాగించాలని మరియు ఈ గల్ఫ్ కప్ ఎడిషన్‌లో అద్భుతమైన ప్రదర్శన ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సందర్భంగా ఆయన ఈ ఛాంపియన్ షిప్ లో ఒమాన్ విజేతగా నిలుస్తుందని సయ్యద్ థియాజిన్ బిన్ హైతం అల్ సెయిడ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమం కువైట్ రాష్ట్ర అమీర్ హిస్ హైనెస్ షేక్ మెషల్ అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సబాహ్ ఆధ్వర్యంలో షేక్ జాబర్ అల్ అహ్మద్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రారంభమైంది. ఈ ప్రతిష్టాత్మక వేడుకలో, ఆతిథ్య దేశమైన కువైట్‌తో ప్రారంభమయ్యే టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్‌కు హిస్ హైనెస్ సయ్యద్ థియాజిన్ హాజరయ్యారు.ఈ మ్యాచ్, కువైట్ క్రౌన్ ప్రిన్స్ హిస్ హైనెస్ షేక్ సబా అల్ ఖలీద్ అల్ సబా సమక్షంలో జరిగింది.ఈ చాంపియన్‌షిప్ అరేబియా గల్ఫ్‌లోని ఫుట్‌బాల్ జట్లను ఒక్కటి చేసే  ఒక ప్రముఖ ప్రాంతీయ క్రీడా కార్యక్రమం ఇది.ఈ చాంపియన్‌షిప్ లో పాల్గొనే దేశాల మధ్య స్నేహాన్ని మరియు క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com