ఏపీ: ఉచిత బస్సు పై అధ్యయనానికి మంత్రుల కమిటీ
- December 22, 2024
అమరావతి: మహిళలకు ఉచిత బస్సు పథకం వివిధ రాష్ట్రాల్లో ఎలా అమలవుతుందో అధ్యయనం చేసేందుకు మంత్రుల బృందంతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ నివేదిక ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌కు అనువైన పథకాన్ని అమలు చేయనుంది. ఈ మేరకు ఓ సర్క్యులర్‌లో తెలిపింది. రవాణా, మహిళా-శిశు సంక్షేమ , హోంశాఖ మంత్రులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని వివరించింది. ఎన్నికల సమయంలో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కూటమి ప్రకటించింది. మరోవైపు అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎంవో అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. ఆయా జిల్లాల్లో తాజా పరిస్థితులను అధికారులు వివరించారు. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు స్కూళ్లకూ సెలవులు ఇచ్చినట్లు సీఎం కు చెప్పారు. వర్షంతో దెబ్బతిన్న పంటనష్టం వివరాలు సేకరించి రైతులకు సాయం అందించాలని చంద్రబాబు ఆదేశించారు. పూర్తి అప్రమత్తంగా ఉండి పనిచేయాలని సూచించారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







