ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- July 10, 2026
కువైట్ సిటీ: రోడ్డు నిర్వహణ పనుల నేపథ్యంలో ఖైతాన్‌లోని హబీబ్ మునవ్వర్ స్ట్రీట్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు కువైట్ జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది.
క్రౌన్ ప్లాజా హోటల్ ఎదురుగా ఉన్న ఈ జంక్షన్ ను జూలై 9 (గురువారం) నుంచి మూసివేస్తామని, నిర్వహణ పనులు పూర్తయ్యే వరకు అంటే జూలై 10 (శుక్రవారం)వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో ఖైతాన్ మరియు ఫర్వానియా ప్రాంతాల్లో ప్రయాణించే వాహనదారులు తమ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని ట్రాఫిక్ శాఖ సూచించింది. వీలైనంత వరకు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని, ట్రాఫిక్ సిగ్నల్స్ మరియు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరింది. రోడ్డు మరమ్మతు పనులు త్వరగా పూర్తయ్యేలా ప్రజలు సహకరించాలని ట్రాఫిక్ అధికారులు కోరారు.
తాజా వార్తలు
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!







