జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- July 10, 2026
దోహా: ప్రపంచ జీవన నాణ్యత (Quality of Life) సూచీలో ఖతార్ గణనీయమైన పురోగతి సాధించింది. నంబియో (Numbeo) గ్లోబల్ డేటాబేస్ aవిడుదల చేసిన 2026 మిడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ లో ఖతార్ ప్రపంచవ్యాప్తంగా 12వ స్థానాన్ని దక్కించుకుంది. గత ర్యాంకింగ్‌తో పోలిస్తే ఖతార్ ఏకంగా ఆరు స్థానాలు మెరుగుపర్చుకుంది.
ప్రజల దైనందిన జీవన పరిస్థితులు, సంక్షేమాన్ని ప్రభావితం చేసే అంశాల ఆధారంగా ఈ సూచీ రూపొందించబడుతుంది. ఇందులో భద్రత, కొనుగోలు శక్తి, ఆరోగ్య సేవలు, గృహాల అందుబాటు, జీవన వ్యయం, ప్రయాణ సమయం, కాలుష్య స్థాయిలు, వాతావరణం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.
ఈ ఫలితాలపై ఖతార్ నేషనల్ ప్లానింగ్ కౌన్సిల్ హర్షం వ్యక్తం చేసింది. ఖతార్ జీవన నాణ్యతలో గణనీయమైన పురోగతి సాధించిందని పేర్కొంది. అలాగే గల్ఫ్ దేశాలలో ఖతార్ రెండో స్థానాన్ని పొందినట్లు తెలిపారు. ఖతార్ మొత్తం స్కోరు 182.7 నుంచి 188.6కు పెరిగిందని, ఇది వివిధ జీవన నాణ్యత ప్రమాణాల్లో దేశం సాధించిన పురోగతికి నిదర్శనమని కౌన్సిల్ తెలిపింది.
మౌలిక వసతుల అభివృద్ధి, మెరుగైన ప్రజా సేవలు, ఆధునిక సౌకర్యాలు, బలోపేతమైన ఆరోగ్య వ్యవస్థ, అలాగే అధిక స్థాయి భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడం వల్లే ఈ ర్యాంకింగ్‌లో ఖతార్ ముందంజ వేసిందని కౌన్సిల్ పేర్కొంది. దీంతో వ్యక్తులు, వ్యాపారాలకు మరింత సురక్షితమైన, అనుకూలమైన వాతావరణం ఏర్పడుతోందని వివరించింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







