మహిళపై వేధింపులు.. నిందితులకు జైలుశిక్ష, జరిమానా..!!
- December 23, 2024
మనామా: ఓ రెస్టారెంట్ లో పని పేరుతో వేధింపులకు పాల్పడుతున్న నిందితుల భారి నుండి తప్పించుకున్న ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితులైన వ్యాపారవేత్త, ఒక ఆసియా సూపర్వైజర్ ను అరెస్ట్ చేసింది. కోర్టు వీరికి ఒక్కొక్కరికి మూడు సంవత్సరాల జైలు శిక్ష, BD2,000 జరిమానా విధించింది. బాధితురాలు తిరిగి స్వదేశం వెళ్లడానికి అవసరమైన మొత్తాన్ని కూడా నిందితులు చెల్లించాలని కోర్టు తన తీర్పులో వెల్లడించింది. జైలుశిక్షలు పూర్తయిన తర్వాత వారిని బహిష్కరిస్తారు. ఉపాధి హామీతో పర్యాటక వీసాపై బహ్రెయిన్‌కు తీసుకువచ్చినట్లు బాధితురాలు నివేదించింది. అనంతరం ఆమెను చట్టవిరుద్ధమైన పరిస్థితులలో.. రెస్టారెంట్లో పని చేయించారని పేర్కొంది. పనిచేసేందుకు నిరాకరించగా, బెదిరింపులు, శారీరక వేధింపులకు గురిచేశారు. ఈ కేసును విచారిస్తున్న ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ.. నిందితులు ప్రత్యేకంగా ఆసియా మహిళలను లక్ష్యంగా చేసుకున్నారని, తప్పుడు హామీలతో వారిని బహ్రెయిన్‌కు తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!
- అనుమతి లేకుండా వ్యక్తిగత డేటా బహిర్గతం..తీవ్రమైన నేరం..!!
- అబుదాబి-దుబాయ్ E11లో EV మెగాహబ్..!!
- 1,197 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- ముసందంలో డిస్కవరీ డైవింగ్ సెంటర్.. టూరిజానికి బూస్ట్..!!
- 2025లో కుటుంబం,బాలల రక్షణకు 4,400 రిపొర్టులు..!!
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం







