ఫాల్కన్రీ, హంటింగ్ ఫెస్టివల్.. రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!

- December 23, 2024 , by Maagulf
ఫాల్కన్రీ, హంటింగ్ ఫెస్టివల్.. రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!

దోహా: ఖతార్ ఇంటర్నేషనల్ ఫాల్కన్రీ అండ్ హంటింగ్ ఫెస్టివల్ (మార్మి 2025) 16వ ఎడిషన్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. కటారా కల్చరల్ విలేజ్‌లోని ఖతారీ అల్ గన్నాస్ అసోసియేషన్ ప్రధాన కార్యాలయంలో డిసెంబర్ 26 వరకు రిజిస్ట్రేషర్ ప్రక్రియ కొనసాగుతుంది. 

మార్మి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ తరతరాలుగా వస్తున్న ఈ సాంప్రదాయ క్రీడతో ముడిపడి ఉన్న సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది అరబ్ ప్రపంచంలోని జానపద కథలలో.. ముఖ్యంగా గల్ఫ్, ఖతారీ సందర్భాలలో దాని ప్రాముఖ్యతను చాటి  చెబుతుంది.

మార్మి ఫెస్టివల్ ఛైర్మన్ ముతిబ్ ముబారక్ అల్ ఖహ్తానీ మాట్లాడుతూ.. హెచ్‌ఈ షేక్ జోవాన్ బిన్ హమద్ అల్ థానీ ఆధ్వర్యంలో ఈ ఉత్సవం ఏటా జరుగుతుందని తెలిపారు. ఖతారీ, గల్ఫ్ వారసత్వాన్ని సంరక్షించడానికి అల్-గన్నాస్ అసోసియేషన్ ఎంతో కృషి చేస్తుందన్నారు. ఖతారీలు, నివాసితులతోపాటు విదేశీ పర్యాటకులతో సహా పెద్ద సంఖ్యలో హాజరవుతారని తెలిపారు. 

మార్మి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ యొక్క 16వ ఎడిషన్ జనవరి 1 నుండి ఫిబ్రవరి 1, 2025 వరకు సీలైన్‌లోని సబ్‌ఖాత్ మార్మిలో నిర్వహించబడుతుందని అల్ ఖహ్తానీ ప్రకటించారు. డిసెంబర్ 22, 23 సలుకి రేసింగ్ పోటీలో నమోదు కోసం కేటాయించారని, హుదూద్ అల్-తహద్ది పోటీకి అధిక డిమాండ్ ఉన్నందున చివరి రిజిస్ట్రేషన్ రోజు వరకు రిజిస్ట్రేషన్ తెరిచి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. డౌ అండ్ తాలా పోటీల కోసం రిజిస్ట్రేషన్లు డిసెంబర్ 24 నుండి 26 వరకు జరుగుతాయి. ఈ ఈవెంట్‌ల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ డిసెంబర్ 20 నుండి 25 వరకు రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంటుంది.

యంగ్ ఫాల్కనర్ పోటీ కోసం రిజిస్ట్రేషన్ సబ్‌ఖాత్ మార్మి, సీలైన్‌లోని ఫెస్టివల్ సైట్‌లో జరుగుతుంది. అన్ని పండుగ పోటీలకు రిజిస్ట్రేషన్‌లను ఖరారు చేసి డ్రా నిర్వహించిన తర్వాత యువ ఫాల్కనర్‌ల పాల్గొనే షెడ్యూల్ సెట్ చేస్తారు. విజేతలకు విలువైన బహుమతులను అందజేస్తారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com