తిరుపతి: స్థానికులకు జనవరి 5 నుంచి దర్శన టోకెన్లు!
- December 23, 2024
తిరుపతి: వచ్చే ఏడాది జనవరి ఐద నుంచి తిరుపతి స్థానికులకు దర్శన కోటా టోకెన్లను జారీ చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రకటించింది.టీటీడీ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు తిరుపతిలోని స్థానికులకు ప్రతి నెలా మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కల్పిస్తామని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి 7వ తేదీ మొదటి మంగళవారం తిరుపతి స్థానికులు శ్రీవారి దర్శనం కల్పించేందుకు వీలుగా జనవరి 5న (ఆదివారం) తిరుపతి మహతి ఆడిటోరియం, తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్లు తెలిపారు.
తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలతో పాటు తిరుమలలోని స్థానికులు టోకెన్లు పొందేందుకు తమ ఒరిజినల్ ఆధార్ కార్డును తప్పనిసరిగా చూపించాలని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







