ప్రముఖ సినీ దర్శకుడు శ్యామ్ బెనగల్ ఇకలేరు
- December 23, 2024
ప్రముఖ సినీ దర్శకుడు శ్యామ్ బెనగల్ కన్నుమూశారు.దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్యామ్ బెనెగల్ (90) ఈరోజు సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈ వార్తను ఆయన కుమార్తె పియా బెనెగల్ ధృవీకరించారు.
సికింద్రాబాద్‌లోని తిరుమలగిరిలో డిసెంబర్ 14వ తేదీన శ్యామ్ బెనెగల్ జన్మించారు. బెనెగల్ నిజాం కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్ నుండి ఎకనామిక్స్ లో పట్టభద్రుడయ్యాడు.
కాపీ రైటర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన బెనెగల్ 1962లో గుజరాతీలో తన మొదటి డాక్యుమెంటరీ చిత్రం ఘేర్ బేతా గంగా (గంగా నది వద్ద) తీశాడు. 2005లో సినిమా రంగంలో భారతదేశ అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించారు. 1976లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. 1991లో కళల రంగంలో ఆయన చేసిన కృషికి పద్మ భూషణ్ లభించింది. అతని విజయవంతమైన చిత్రాలలో మంథన్, జుబైదా, సర్దారీ బేగం ఉన్నాయి.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







