ఆగస్ట్ 12న జనతా గ్యారేజ్ రిలీజ్
- June 27, 2016
కొన్ని సినిమాలు రిలీజైన తర్వాత కలెక్షన్స్ లో దుమ్ము రేపితే... మరికొన్ని సినిమాలు మేకింగ్ లో ఉండగానే బిజెనెస్ బొనాంజా స్టార్టయి పీక్ కు వెళతాయి. జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న జనతా గ్యారేజ్ ఇప్పుడు హై లెవెల్ లో బిజినెస్ చేస్తోంది. రిలీజ్ కు ముందే ఆ సినిమాకు 62 కోట్ల రూపాయల బిజినెస్ అయిందంటే మాటలు కాదు. దీన్ని బట్టి జూనియర్ మూవీకి ఎంత రేంజ్ ఉందో అర్థమవుతోంది.జనతా గ్యారేజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. నైజాంలో ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు దిల్ రాజ్ ఈ సినిమాను 15.3 కోట్ల రూపాయలకు తీసుకున్నాడు. సీడెడ్ లో కూడా జనతా గ్యారేజ్ బిజినెస్ స్పీడ్ గానే ఉంది. అక్కడ 9 కోట్ల బిజినెస్ అయింది. ఇక నెల్లూరుకు 2.34 కోట్లు, గుంటూరుకు 4.65 కోట్లు, కృష్ణాకు 3.5 కోట్లు, తూర్పు గోదావరి 4.5 కోట్లు, పశ్చిమ గోదావరి 3.5 కోట్లు బిజినెస్ జరిగినట్టు సమాచారం. ఇక ఉత్తరాంధ్ర 5.12 కోట్లు, కర్ణాటకలో 7.02 కోట్లు, ఇండియాలో ఒక కోటి, ఓవర్సీస్ లో 7.25 కోట్ల రూపాయల బిజినెస్ అయింది. ఈ బిజినెస్ రేంజ్ చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు. ప్రముఖ మలయాళీ నటుడు మోహన్ లాల్ ఒక ముఖ్యపాత్రలో నటించే ఈ సినిమాలో సమంత , నిత్యామీనన్ హీరోయిన్స్. కొరటాల శివ దర్శకుడు. ఆగస్ట్ 12న ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









