బాహుబలి 2 వార్ సీన్ డైరెక్ట్ చేసిన నాని
- June 27, 2016
యంగ్ హీరో నాని సీజన్ ఇది. వరస హిట్స్ తో దూసుకుపోతున్నాడు ఈ జెంటిల్ మన్. ఫ్యాక్ట్ చెప్పాలంటే నాని ఉంటే చాలు పిక్చర్ హిట్ అన్న పేరు సంపాదించుకున్నాడు ఈ భలే మగాడు. పెద్ద సినిమాల మాటేమో కానీ, నాని ఉంటే ఆ పిక్చర్ కు మినిమం గ్యారెంటీ ఉంటుందన్న సెంటిమెంట్ వచ్చేసింది. అయితే ఈ యంగ్ హీరో ఇప్పుడు సడెన్ గా డైరెక్టర్ కూడా అయిపోయాడు.విచిత్రంగా ఉందే... హీరో డైరెక్ట్ చేయడమేంటి? అనుకుంటున్నారా? అవును... నిజంగా జరిగింది. ఇప్పటికే ఎన్నో అద్భుతాలు సృష్టించిన బాహుబలి సెట్లో ఇలాంటి విచిత్ర సంఘటన జరిగింది. అదేమంటే...రామోజీ ఫిలిం సిటీలో ప్రస్తుతం బాహుబలి 2 షూటింగ్ జరుగుతోంది. అక్కడే కాస్త దూరంలో నాని నటిస్తున్న పిక్చర్ షూటింగ్ కూడా జరుగుతోంది. షూటింగ్ గ్యాప్ లో బాహుబలి షూటింగ్ జరిగే ప్లేస్ కు నాని వెళ్లాడట. నాని వచ్చిన టైంలో డైరెక్టర్ రాజమౌళి కొన్ని వార్ సీన్స్ ను తీస్తున్నాడు. నానిని చూసిన రాజమౌళి ...ఒక సీన్ ను డైరెక్ట్ చేయమని కోరాడట. నాని ఆనందానికి అంతే లేదు. వెంటనే మెగా ఫోన్ అందుకొని స్టార్ట్ కెమెరా...యాక్షన్ అని డైరెక్ట్ చేశాడు. నాని డైరెక్ట్ చేస్తున్న స్టిల్ ను బాహుబలి యూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. డైరెక్షన్ చేయడం నానికి కొత్త కాదు. హీరో కాకముందు డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసిన అనుభవం ఉంది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







