యూఏఈ తొలి నానో శాటిలైట్ ప్రయోగానికి సిద్ధం
- June 27, 2016
యూఏఈ తొలి కమ్యూనికేషన్ నానో శాటిలైట్ నయిఫ్-1 ఈ ఏడాది నాలుగో క్వార్టర్‌లో ప్రయోగానికి సిద్ధంగా ఉందని మొహమ్మద్ బిన్ రషీద్ సెంటర్ (ఎంబిఆర్‌ఎస్‌సి) ఓ ప్రకటనలో తెలిపింది. ఎంబిఆర్‌ఎస్‌సి మరియు అమెరికయన్ యూనివర్సిటీ ఆఫ్ షార్జా (ఎయుఎస్) సంయుక్తంగా ఈ శాటిలైట్‌ని రూపొందించారు. అన్ని పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయనీ, స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి దీన్ని పంపించనున్నామని ఆ ప్రకటనలో వెల్లడించారు. ఎయుఎస్‌కి చెందిన ఏడుగురు ఎమిరేటీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఈ శాటిలైట్‌ని డిజైన్ చేసి, రూపొందించారు. ఎంబిఆర్‌ఎస్‌సి పర్యవేక్షణలో ఇది జరిగింది. నయిఫ్-1 ప్రాజెక్టు మేనేజర్ ఇబ్రహీమ్ అల్ కాసిమ్ మాట్లాడుతూ, శాటిలైట్ పలు పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసిందని అన్నారు. శాటిలైట్ టెక్నాలజీలో ఎమిరేటీ స్టూడెంట్స్ చూపిన ప్రతిభను పలువురు కొనియాడుతున్నారు. ఈ రంగంలో యూఏఈ మరింతగా దూసుకుపోనుందని ఎంబిఆర్‌ఎస్‌సి డైరెక్టర్ జనరల్ యూసుఫ్ హమాద్ అల్ షైబాని చెప్పారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







